వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌కు 14 రోజుల జుడీషియల్ కస్టడీ, తీహార్ జైలుకు తరలింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో శుక్రవారం నిరసనలు చేపట్టిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు తీస్ హజారీ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. శనివారం సాయంత్రం పోలీసులు ఆయనను తీస్ హజారీ కోర్టు ముందు హాజరుపర్చారు.

బెయిల్ కోసం చంద్రశేఖర్ పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను తీస్ హజారీ కోర్టు తిరస్కరించింది. 14 రోజులపాటు జుడీషియల్ కస్డడీ విధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతడ్ని తీహార్ జైలుకు తరలించారు. చంద్రశేఖర్ ఆజాద్ వేలాది మందితో నిరసనలు చేపట్టడంతోపాటు హింసను రెచ్చగొట్టారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.

 Bhim Army chief, Chandrashekhar Azad sent to 14-day judicial custody

ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో 15 మంది ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం వారిని కోర్టులో హాజరుపర్చగా.. వారికి రెండ్రోజుల జుడీషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం చంద్రశేఖర్‌ను కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.
ఆజాద్ సజీవంగా ఉన్నాడో లేడోనంటూ ఆయన తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయడంతో భీమ్ ఆర్మీ చీఫ్‌ను ప్రత్యేకంగా కోర్టు ముందు పోలీసులు హాజరుపర్చారు.

శుక్రవారం జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకూ చంద్రశేఖర్ ఆజాద్ నిర్వహించగ తలపెట్టిన ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఆయన పోలీసుల కళ్లు గప్పి జామా మసీదు వద్దకు చేరుకుని.. అక్కడ భీమ్ ఆర్మీ మద్దతుదారులను కలిశారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
The bail plea of Bhim Army Chief, Chandrashekhar Azad has been dismissed by Tis Hazari Court in Delhi and he is taken to the Tihar jail on Saturday. He has been sent to 14-day judicial custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X