భీమా కోరేగావ్ కేసు: ఫాదర్ స్టాన్ స్వామి, ప్రొఫెసర్ హనీ బాబులపై బాంబే హైకోర్టు కీలక ఉత్తర్వులు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన భీమా కోరేగావ్ -ఎల్గర్ పరిషత్ కేసుల్లో నిందితులపై బాంబే హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. భీమా కోరేగావ్ కేసులో నిందితుడు, 84ఏళ్ల హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడం, కరోనా పరిస్థితుల నేపథ్యంలో అవకాశం ఉన్న అందరినీ పెరోల్ పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్టాన్ స్వామిని జైలు నుంచి జేజే ఆస్పత్రికి తరలించే విషయమై బాంబే హైకోర్టు బుధవారం ఉత్తర్వులిచ్చింది.

స్టాన్ స్వామిని గురువారం జేజే ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలని, శుక్రవారంలోగా రిపోర్టులను కోర్టుకు సమర్పించాలని, అందులోని వివరాలను బట్టి స్వామిని ఆస్పత్రిలోనే ఉంచడమా, పెరోల్ పై విడుదల చేయడమా అనేది నిర్ణయిస్తామని బాంబే హైకోర్టు పేర్కొంది. గతంలో వెలువరించిన ఇలాంటి ఆదేశాలనే అధికారులు ఖాతరు చేయకపోవడంతో ఈసారి స్వామిని ఆస్పత్రికి తీసుకెళ్లకుంటే తీవ్ర పరిణామాలుంటాయని కోర్టు హెచ్చరించింది. మరోవైపు ఇదే..

bhima-koregaon-case-bombay-hc-on-father-stan-swamy-prof-hany-babu-health-issues

భీమా కోరేగావ్ -ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్జై జైలులోఉన్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హనీ బాబుకు బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో ఆయనను బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించే విషయమై బాంబే హైకోర్టు బుధవారం ఉత్తర్వులిచ్చింది. బ్లాక్ ఫంగస్ సోకిన హనీ బాబును వెంటనే ఆస్పత్రికి తరలించకుంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తరఫు లాయర్లు వాదించారు. దీంతో జస్టిస్‌ ఎస్‌జె ఖతావాలా, ఎస్‌పి తవడేతో కూడిన వెకేషనల్‌ బెంచ్‌.. ప్రొఫెసర్ ను గురువారమే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+