ప్రభుత్వ కార్యాలయాల్లో భారీ అగ్ని ప్రమాదం: పక్కనే 5.5 కోట్ల అత్యాధునిక ఫైరింజిన్ ఉంది కానీ..

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చోచేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరంతస్తుల భవనంలో కీలక ప్రభుత్వ శాఖల కార్యాలయాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అగ్ని మాపక సిబ్బంది, వాయుసేన, సైన్యం సాయంతో 14 గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే, భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్న సమయంలో అక్కడికి కేవలం 40 మీటర్ల దూరంలోనే ఓ ఆధునిక ఫైర్ ఇంజిన్ నిలిపి ఉంచటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆ ఫైర్ ఇంజిన్‌ను సకాలంలో ఉపయోగించివుంటే మంటలు మరింత త్వరగా అదుపులోకి వచ్చేవని అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు చెబుతున్నారు. కాగా, తొమ్మిది నెలల క్రితం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 5.5 కోట్లతో అత్యాధునిక హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్‌ను కొనుగోలు చేసింది. దీని సాయంతో అగ్నిమాపక సిబ్బంది 18 అంతస్తుల వరకు సునాయాసంగా చేరుకోవచ్చు.

Bhopal Fire accident: questions raised after Rs 5.5-Crore Hydraulic Ladder Stood 40 Metres Away the spot

కానీ, స్థానిక ఆర్టీఏ అధికారుల నుంచి ఈ ఫైర్ ఇంజిన్‌కు అనుమతులు రాకపోవడంతో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మరోవైపు, ఈ హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్‌ వినియోగంపై సిబ్బందికి పూర్తి అవగాహన లేకపోవడంతో దీన్ని పక్కన పెట్టడానికి మరో కారణంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వివరణ ఇచ్చారు.

అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో దాన్ని ఉపయోగించలేదని మంత్రి తెలిపారు. ఇకపై పెద్ద భవనాలు ఉన్న ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు వెళ్లేందుకు సరిపడా దారి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించినట్లు మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.

కాగా, సత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. పెద్ద ఎత్తున భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది, సైన్యం, వాయుసేన. పెద్ద ఎత్తున ఫర్నీచర్, కీలక ఫైల్స్ ఈ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదం గమనించి ముందే భవనం నుంచి సిబ్బంది, అధికారులు బయటకు వెళ్లిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+