3గంటలపాటు గ్యాంగ్ రేప్: ఫిర్యాదుకు వెళ్తే నాటకాలన్నారు!, నిందితులని వేటాడి పట్టుకుంది

Subscribe to Oneindia Telugu

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఐఏఎస్ కోచింగ్‌ తీసుకుంటున్న యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ముగ్గురు పోలీసులపై వేటు పడింది.

కోచింగ్ వెళ్లి వస్తుండగా..

కోచింగ్ వెళ్లి వస్తుండగా..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి 19ఏళ్ల యువతి సివిల్స్‌ కోచింగ్‌ క్లాస్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేందుకు భోపాల్‌లోని హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్తొంది. గమనించిన గోలు, అమర్‌ అనే యువకులు ఆమెను అడ్డగించి దాడి చేసి రైల్వేస్టేషన్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు దాదాపు మూడు గంటల పాటు ఆమెపై పైశాచికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

ఫిర్యాదు చేసేందుకు వెళితే..

ఫిర్యాదు చేసేందుకు వెళితే..

అనంతరం ఆమెను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. కానీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేకప్‌ వేసుకొని అత్యాచారం జరిగిందని చెప్పి నాటకమాడుతున్నట్లు పోలీసులు హేళనగా మాట్లాడారని బాధితురాలు తెలిపారు.

వెంటాడి పట్టుకున్నారు..

వెంటాడి పట్టుకున్నారు..

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం తిరిగి వస్తుండగా.. ఘటన జరిగిన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో గోలు, అమర్‌ను యువతి గుర్తించింది. వెంటనే ఆమె కుటుంబసభ్యులు వారి వెంట పడి ఎట్టకేలకు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నిందితులను గోలు బీహారీ, అమర్ ఛంటూ, రాజేష్, రమేష్‌లుగా పోలీసులు గుర్తించారు. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు కూడా భద్రతా విభాగంలోనే పనిచేస్తున్నారు.

సీఎం ఆగ్రహం.. ముగ్గురు పోలీసులపై వేటు

సీఎం ఆగ్రహం.. ముగ్గురు పోలీసులపై వేటు

ఈ భోపాల్ అత్యాచార ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ చేసేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధిత యువతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌హెచ్ఓ జీఆర్పీ మోహిత్ సక్సేనా, హబీబ్‌గంజ్ ఎస్‌హెచ్ఓ భూపేంద్ర, మహారాణా ప్రతాప్‌ నగర్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ సంజయ్ సింగ్‌లు సస్పెన్షన్ వేటు పడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Madhya Pradesh government on Friday suspended three police officers for their negligence and alleged misbehavior with a rape victim during filing of the complaint.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి