భోపాల్ గ్యాంగ్‌రేప్: ‘ఇష్టపూర్వకమే’నంటూ వైద్య నివేదికలో ఘోర తప్పిదం

Subscribe to Oneindia Telugu

భోపాల్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌‌లో జరిగిన యువతి సామూహిక అత్యాచార కేసులో ఘోర తప్పిదం జరిగింది. యువతి ఇష్టపూర్వకంగానే నిందితులతో శృంగారంలో పాల్గొందంటూ మెడికల్‌ రిపోర్టు రావటం కలకలం రేపింది. దీంతో హడావుడిగా రంగంలోకి దిగిన అధికారులు అది పొరపాటున జరిగిందంటూ వివరణ ఇచ్చారు.

ఘోర తప్పిదం..

ఘోర తప్పిదం..

సుల్తానియా మహిళా ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ కరణ్‌ పీప్రె ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆమె(బాధితురాలు)కు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది కొత్త వాళ్లు కావటంతో ఈ తప్పు దొర్లింది. తప్పును సరి చేసే కొత్త నివేదికను విడుదల చేశాం' అని తెలిపారు.

మరోసారి జరగనివ్వం..

మరోసారి జరగనివ్వం..

ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని.. సున్నితమైన కేసుల్లో సీనియర్ మహిళ వైద్యురాలి పర్యవేక్షణ తప్పనిసరి చేసినట్లు ఆయన చెప్పారు. నివేదిక తయారీలో ఏవైనా ఒత్తిడులు వస్తున్నాయా? అన్న ప్రశ్నకు... వైద్య విభాగంలో ఎలాంటి ఒత్తిళ్లు పని చేయవని చెప్పారు.

3గంటలపాటు గ్యాంగ్ రేప్: ఫిర్యాదుకు వెళ్తే నాటకాలన్నారు!, నిందితులని వేటాడి పట్టుకుంది

కోచింగ్‌కు వెళ్లి వస్తుండగా..

కోచింగ్‌కు వెళ్లి వస్తుండగా..

కాగా, గత వారం సివిల్స్‌ ఎగ్జామ్‌ కోసం కోచింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న 19ఏళ్ల యువతి లాక్కెల్లి కొందరు వ్యక్తులు హబీబ్‌గంజ్‌ ప్రాంతంలో అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు బాధితురాలు ఫిర్యాదు ఇచ్చిన తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ జోక్యం చేసుకుని ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాధ్యులైన సిబ్బందిపై వేటు పడింది. కాగా, బాధితురాలే నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించడం గమనార్హం.

నిందితులపై నిర్భయ కేసు

నిందితులపై నిర్భయ కేసు

అరెస్టయిన నలుగురు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఇక బాధితురాలికి నగరంలోని సుల్తానియా మహిళా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. తప్పుడు ప్రాథమిక నివేదిక సమర్పించి ఈసారి వైద్యాధికారులు విమర్శలపాలయ్యారు. ఆ తర్వాత మరో కొత్త సరైన నివేదికను అందిస్తామని వైద్యులు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The medical report of a 19-year-old girl gangraped by four people in Bhopal on October 31, has been found to have initially stated that the victim had consensual sex.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి