ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం: భూటాన్ అత్యున్నత పురస్కారం ప్రకటన
న్యూఢిల్లీ/థింపు: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. పొరుగుదేశాలతో బలమైన మైత్రీ సంబంధాల కోసం ప్రత్యేక కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి భూటాన్ తమ దేశ అత్యున్న పౌర పురస్కారమైన నాడగ్ పెల్ గి ఖోర్లో(Ngadag Pel gi Khorlo)తో సత్కరించింది. భూటాన్ నేషనల్ డేను పురస్కరించుకుని ఈ అవార్డును ప్రకటించింది.
ఈ విషయాన్ని భూటాన్ దేశ ప్రధానమంత్రి లొటయ్ షెరింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ప్రధాని మోడీ ఎంపిక కావడం పట్ల సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.

'భూటాన్ రాజు ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన అందిస్తున్న స్నేహపూర్వక సహకారం, ముఖ్యంగా కోవిడ్ సమయంలో మోడీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డు అందిస్తున్నాం. భూటాన్ ప్రజల తరపున మోడీకి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి మీరు ఎంతగానో అర్హులు. ఈ అవార్డు అందుకునేందుకు మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం' అని భూటాన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత ప్రధాని మోడీ ఆధ్యాత్మిక చింతన కలిగిన గొప్ప వ్యక్తిగా కొనియాడింది.
Thank you, Lyonchhen @PMBhutan! I am deeply touched by this warm gesture, and express my grateful thanks to His Majesty the King of Bhutan. https://t.co/uVWC4FiZYT
— Narendra Modi (@narendramodi) December 17, 2021
భూటాన్ అత్యున్నత పౌర పురస్కారానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంపికైన సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ప్రధాని మోడీ భూటాన్ రాజుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భూటాన్ ప్రజల అప్యాయత తన మనసును తాకిందని అన్నారు.
కాగా, ఇప్పటికే ప్రధాని మోడీకి పలు దేశాలు అత్యున్నత పురస్కారాలను అందజేశాయి. సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, యూఏఈ, రష్యా, మాల్దీవులు, పాలస్తీనా, బహ్రెయిన్ దేశాలు అత్యున్నత పురస్కారాలతో గౌరవించాయి. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన లెజియన్ ఆఫ్ మెరిట్ ను మోడీకి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహూకరించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications