సాహితీవేత్త హత్య, తరువాత నువ్వే అంటు ట్విట్
ముంగళూరు: ప్రముఖ కన్నడ సాహితీ వేత్త, హంపి విశ్వవిధ్యాలయం మాజీ ఉప కులపతి ఎం.ఎం. కలబుర్గి (77) హత్య జరిగిన కొన్ని గంటల వ్యవదిలో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తు ట్విట్ చేసిన యువకుడిని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

భువిత్ శెట్టి అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని సోమవారం పోలీసు అధికారులు తెలిపారు. ఆదివారం దారవాడలో కలబుర్గిని దుండగులు కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆయన హత్య జరిగిన కొన్ని గంటల తరువాత భువిత్ శెట్టి వివాదస్పదంగా ట్విట్ చేశాడు.

మొన్న అనంతమూర్తి, నేడు కలబుర్గి, రేపు ప్రోఫసర్ కే.ఎస్. భగవాన్ అంటు ట్విట్ చేశాడు. ఆదివారం ఉదయం 10.41 గంటల సమయంలో భువిత్ శెట్టి రెండు ట్విట్ లు చేశాడు. విషయం తెలుసుకున్న బంట్వాళ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.

భువిత్ శెట్టి కోసం గాలించారు. మంగళూరు సమీపంలో తలదాచుకున్న భువిత్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను వివాదస్పద వ్యాఖ్యలు చేస్తు ట్విట్ ఎందుకు చేశాడు, అతని ఉద్దేశం ఏమిటి, సాహితీవేత్త ప్రోఫసర్ భగవాన్ ను ఎందుకు టార్గెట్ చేశాడు అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
అరెస్టు అయిన భువిత్ శెట్టి దక్షిణ కన్నడ జిల్లాలో భజరంగ్ దళ్ నాయకుడిగా పని చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇతని ట్విట్ ల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి, కలబుర్గిని హత్య చేసిన వారికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా అని వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications