బీహర్ పాలిటిక్స్: స్పీకర్‌కు కరోనా పాజిటివ్, ఆ తర్వాత రికవరీ, కీలక సమయంలో..
బీహర్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. బీజేపీకి నితీశ్ కుమార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరి యత్నంగా అమిత్ షా కూడా రంగంలోకి దిగారు. అయితే స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా అందరికీ షాక్ ఇచ్చినంత పనిచేశారు. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందట. అసెంబ్లీలో బల బలాలు, బల నిరూపణ కోసం స్పీకర్ పాత్ర కీలకం.. సరిగ్గా ఈ సమయంలోనే ఆయన వైరస్ బారిన పడ్డారట.
సిన్హాకు ఆదివారం పాజిటివ్ రాగా.. సోమవారం మరోసారి టెస్ట్ చేశారు. ఇంకేముంది నెగిటివ్ వచ్చిందట.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. సోమవారం రాత్రి స్పీకర్ సిన్హాను రామ్ నారాయణ్ మండల్ కలిశారు. ఎథిక్స్ కమిటీ సభ్యులతో కలిసి రిపోర్టును అందజేశారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు మండల్ నిరాకరించారు.

Recommended Video

గతేడాది మార్చిలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కుర్చీలో బందీగా ఉంచి.. పోలీసులను పిలిచిన ఘటనను ఆయన గుర్తుచేశారు. సదరు నివేదికలో 18 మంది ఎమ్మెల్యేల పేర్లు తెలియరాలేదని సదరు వర్గాలు తెలిపాయి. స్పీకర్ సలహా మేరకు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేస్తారు. వారి సమాధానం మేరకు అనర్హత వేటు కూడా వేసే ఛాన్స్ ఉంటుంది. స్పీకర్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని విధాన సభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications