వ్యభిచారం చేస్తేనే ఇంట్లో ఉంచుతాం! అత్తింటి కిరాతకానికి పసికందు తల్లి సూసైడ్!
కర్ణాటక బీదర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు అదనపు కట్నం కోసం వేధించే అత్తమామలను చూశాం కానీ.. ఏకంగా కట్టుకున్న భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టాలని ప్రయత్నించిన కిరాతక అత్తింటి వారి కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. అత్తింటి వేధింపులు తాళలేక 22 ఏళ్ల వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే?
బీదర్ జిల్లా భాల్కి ప్రాంతానికి చెందిన అంజనాబాయి(22)కి, బసవకల్యాణ్‌కు చెందిన శేఖర్ పాటిల్‌తో 2022తో వివాహమైంది. వివాహ సమయంలో కన్నవారు తమ స్తోమతకు తగ్గట్టుగా లాంఛనాలు పూర్తి చేసి పంపారు. పెళ్లయిన కొత్తలో కాపురం సజావుగానే సాగింది. వీరికి ప్రస్తుతం 11 నెలల పసికందు కూడా ఉంది. అయితే బసవకల్యాణ్‌లోని ఓం కాలనీలో నివసిస్తున్న ఈ కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు మొదలయ్యాయి.

వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి
అంజనాబాయి మృతిపై ఆమె తండ్రి విజయ్‌కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. పెళ్లయిన కొన్నాళ్ల నుంచే భర్త, అత్తమామలు ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. అంతటితో ఆగక అంజనాబాయిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టాలని వారు పన్నాగం పన్నారు. పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని, వారితో వెళ్లాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.
నిరాకరించినందుకు చిత్రహింసలు
అత్తింటి వారు చెప్పిన అసభ్యకరమైన పనులకు అంజనాబాయి ససేమిరా అని నిరాకరించింది. పవిత్రమైన బంధంతో అడుగుపెట్టిన ఇంట్లో ఇలాంటి అరాచకాలు చేయనని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహించిన భర్త, అత్తమామలు ఆమెపై కిరాతకంగా దాడులు చేయడం ప్రారంభించారు. ప్రతిరోజూ నరకం చూపిస్తూ, మానసిక క్షోభకు గురిచేశారు. ఆ పసికందు ముఖం చూసైనా వారు మారతారేమో అని వేచి చూసిన అంజనాబాయికి, చివరకు మృత్యువే శరణ్యమనిపించింది. సోమవారం ఉదయం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
ముగ్గురు నిందితుల అరెస్ట్
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తండ్రి విజయ్‌కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా బసవకల్యాణ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త శేఖర్ పాటిల్‌తో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసు కస్టడీలో ఉన్నారు. కన్నకూతురిని పొట్టనబెట్టుకున్న కిరాతకులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications