అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం.. సిబ్బందికి పాజిటివ్.. ఐసోలేషన్‌లో బిగ్ బీ
దేశంలో కరోనా మహామ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే రెట్టింపు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాజకీయ నాయకులు, సీని ప్రముఖులు కూడా వైరస్ బారినపడ్డారు. తాజాగా అమితాబచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. తన నివాసంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటిన్‌గా నిర్థారణ అయింది. దీంతో బిగ్ బీ ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

బిగ్ బీ నివాసంలో కరోనా కలకలం
ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. జనవరి 2న అతనికి పరీక్షలు నిర్వహించారు. ఆటెస్ట్‌లో అతనికి పాజిటివ్ గా తేలింది. అనంతరం బిగ్ బీ వద్ద పనిచేస్తున్న మిగతా 30 మంది సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. వారికి మాత్రం టెస్ట్‌లలో నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం కరోనా సోకి వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ముందస్తు జాగ్రత్తగా అమితాబ్ బచ్చన్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆ ఉద్యోగితో కలిసిన వారు కూడా ఐసోలేషన్‌లోకి ఉన్నారు.

గతంతో అమితాబ్ ఫ్యామిలీని వెంటాడిన కరోనా
2020లో అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా సోకింది. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. అక్కడ వారు చాలా రోజుల పాటు చికిత్స చేయించుకున్నారు. ఒక వారం తర్వాత ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కు కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పడు తాజాగా అమితాబ్ బచ్చన్ నివాసంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో ఆందోళన నెలకొంది. అందరూ పరీక్షలు చేయించుకున్నారు. మందు జాగ్రత్తగా అమితాబ్ బచ్చన్ హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. కరోనా భారిన పడ్డ వ్యక్తిని కలిసిన సిబ్బంది కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు.

మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ
దేశంలో నిన్న ( మంగళవారం ) ఒక్క రోజే 58,097 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 534 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,14, 004 కు చేరింది. దేశంలో నమోదైన కరోనా , ఒమిక్రాన్ కేసులలో సగం మహారాష్ట్రాలోనే నమోదవుతున్నాయి. దీంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. మహారాష్ట్రలో కొత్తగా 18,466 కరోన పాజిటివ్ కేసులు వచ్చాయి. 20 మంది మృతి చెందారు. అటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరింది. కొత్తగా 75 ఒమిక్రాన్ పాటిజిట్ కేసులు వచ్చాయి.
Recommended Video

వైరస్ భారిన పడ్డ వైద్యులు, మంత్రులు
మహారాష్ట్రలో గడిచిన 48 గంటల్లో 170 మంది వైద్యులకు కరోనా సోకింది. ఇప్పటివరకు 10 మందికిపైగా మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు ఈ వైరస్ భారిన పడ్డారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలను కఠిన తరం చేసింది. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications