భారీ మార్పు కోసమే: నామినేషన్ వేసిన మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ధీమా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి అనూహ్యంగా వచ్చిన సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో పెద్ద మార్పు కోసం తాను పోరాడుతున్నానని, తనకు ఓటు వేయాలని ప్రతినిధులందరినీ కోరారు. తనకు మద్దతునిస్తూ తన వెంట నడిచిన నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలకు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుస్తానంటూ మల్లిఖార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుస్తానంటూ మల్లిఖార్జున ఖర్గే

అక్టోబర్ 17న ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామని అన్నారు. తాను గెలుస్తాననే నమ్మకముందని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తాను తన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను 8,9 తరగతుల్లో ఉన్నప్పుడే గాంధీ, నెహ్రూ సిద్ధాంతాల కోసం ప్రచారం చేశానని చెప్పారు.

మల్లిఖార్జున ఖర్గేకు నాయకుల మద్దతు, గాంధీలు కూడా?

మల్లిఖార్జున ఖర్గేకు నాయకుల మద్దతు, గాంధీలు కూడా?

కాగా, మల్లిఖార్జున్ ఖర్గే అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, రమోద్ తివారీ, పీఎల్ పునియా, ఏకే ఆంటోనీ, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ ప్రతిపాదించారు. జీ 23 నాయకులు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ మద్దతు ఇచ్చారు. అయితే, మల్లిఖార్జున ఖర్గే గాంధీ కుటుంబం మద్దతుతోనే నామినేషన్ వేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన గెలుపు ఖాయమని తెలుస్తోంది

ఖర్గేతోపాటు నామినేషన్ వేసిన శశిథరూర్

మరోవైపు కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ కూడా శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. శశిథరూర్ తన పత్రాలను పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి సమర్పించారు. శశిథరూర్ తన మేనిఫెస్టోను విడుదల చేయడంతోపాటు తనకు అన్ని రాష్ట్రాల నేతల నుంచి మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం థరూర్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక భారతదేశంలోని యువకులకు, దేశ భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు.

మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ మధ్యే ప్రధాన పోటీ

మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ మధ్యే ప్రధాన పోటీ

అంతకుముందు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా చివరి వరకు రేసులో ఉండి, ఆ తర్వాత తప్పుకున్నారు. అశోక్ గెహ్లాట్ తాను కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు గురువారమే ప్రకటించారు. అంతేగాక, రాజస్థాన్ పరిణామాలకు ఆయన సోనియా గాంధీకి క్షమాపణలు కూడా చెప్పారు. మరోవైపు, ఖర్గే బరిలోకి రావడంతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. దీంతో శశిథరూర్, మల్లిఖార్జున్ ఖర్గే మధ్యే కీలక పోటీ ఉండనుంది. మరో నేత కూడా నామినేషన్ దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+