• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాలి పెళ్లి అదుర్స్: కబాలి, ముఠామేస్త్రీ డ్యాన్స్ (ఫోటోలు)

|

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లి వేడుకలు ఘనంగా రంగరంగ వైభంగా జరుగుతున్నాయి. బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని టెన్నీస్ కోర్టు సమీపంలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.

శ్రీ కృష్ణదేవరాయల దర్బార్ ను కళ్లకుకట్టినట్లు సెట్టింగ్స్ సృష్టించారు. ఈ వేదిక మీదే సోమవారం మెహంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివేణి బృందం రాజస్థాన్ శైలి సాంప్రదాయ నృత్యాలు (ధాండియా) చేశారు.

సాంప్రదాయం

సాంప్రదాయం

ఇదే సమయంలో డోలు వాయిద్యాలు, కోలాటం తదితర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వరుడి కుటుంబ సభ్యులు, ఎంపీ శ్రీరాములు కుమార్తె ,బంధు మిత్రులు పాల్గొన్నారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి ఎంపీ (బీజేపీ) శ్రీరాములు అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ శుభకార్యానికి హాజరైనారు. శుభకార్యానికి విచ్చేసిన వారికి అన్ని సౌకర్యాలు వీరే దగ్గరుండి చూసుకుంటున్నారు.

స్వాగత తోరణాలు

స్వాగత తోరణాలు

వసంత్ నగరలోని మౌంట్ కార్మల్ కాలేజ్ ప్రవేశ ద్వారం దగ్గర, టీవీ స్టేషన్ కు వెళ్లే మార్గంలో కళ్లు చెదిరిపోయేలా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అన్ని రోడ్లలో ఇప్పటికే స్వాగత తోరణాలు ఏర్పాట్లను పూర్తి చేశారు.

36 ఏకరాల స్థలంలో

36 ఏకరాల స్థలంలో

బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని 36 ఎకరాల ప్రాంతంలోని టెన్నీస్ కోర్టు దగ్గర గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం జరుగుతోంది. ఆ పరిసర ప్రాంతాల్లోనే పెళ్లి మండపం, స్టేజ్, మ్యూజికల్ నైట్ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్, భోజనాలు చెయ్యడానికి ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ ను ఆర్ట్ డైరెక్టర్ శశిధర అడప నేతృత్వంలోని బృందం కళ్లు చెదిరిపోయే విధంగా అలంకరించారు.

డీసీపీ సందీప్ పాటిల్

డీసీపీ సందీప్ పాటిల్

36 ఎకారాల స్థలంలో జరుగుతున్న పెళ్లి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. డీసీపి సందీప్ పాటిలో నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కబాలి, ముఠామేస్త్రీ గెటప్స్

కబాలి, ముఠామేస్త్రీ గెటప్స్

ఆదివారం రాత్రి జరిగిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి, మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్ట్రీ, గంధద గుడి (కన్నడ) సినిమా పాటలకు డ్యాన్స్ లు వేసి అందరిని అలరించారు.

మ్యూజికల్ నైట్

మ్యూజికల్ నైట్

నవంబర్ 15వ తేది మంగళవారం రాత్రి బెంగళూరు ప్యాలెస్ మైదానంలో స్టార్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బహుబాష నటి, మిల్క్ క్వీన్ తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియమణి, శానవి, స్నేహ తదితరులు ఈ స్టార్ మ్యూజికల్ నైట్ లో పాల్గొంటారని గాలి అనుచరులు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru is all set for Big fat wedding of Gali Janardhana Reddy’s daughter on Wednesday(November 16). The expenditure of wedding is over Rs 150 crores which would have surely ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more