వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ బిగ్‌గేమ్! మమతా బెనర్జీ సర్కారు ఈ డిసెంబర్‌లోనే కుప్పకూలనుందా?

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ సర్కారుపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. టీఎంసీ సర్కారు డిసెంబర్ నెలే గడువు అని పేర్కొంది. డిసెంబర్ నెలలోనే మమతా బెనర్జీ సర్కారు కుప్పకూలుతుందని జోస్యం చెప్పింది.

మమతా బెనర్జీ సర్కారుకు బీజేపీ డిసెంబర్ డెడ్‌లైన్

మమతా బెనర్జీ సర్కారుకు బీజేపీ డిసెంబర్ డెడ్‌లైన్

బీజేపీ అసన్సోల్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ భారీ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. వచ్చే డిసెంబర్ నెలలోనే మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోతుందని తేల్చిచెప్పారు. 'డిసెంబర్‌లో ఇక్కడ ఖేలా జరగనుంది. 30 మందికిపైగా టీఎంసీ ఎమ్మెల్యేలు మా పార్టీతో కాంటాక్ట్‌లో ఉన్నారు. వారికి తెలుసు డిసెంబర్ తర్వాత టీఎంసీ ప్రభుత్వం మనుగడలో ఉండదని' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అగ్నిమిత్ర పాల్. మమతా బెనర్జీ సర్కారు అవినీతితో పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని మండిపడ్డారు.

బెంగాల్‌లో మమతా సహా టీఎంసీ నేతలంతా జైల్లోకే..!

మా స్ట్రాటజీని మేము వెల్లడించం కానీ, ఏదో జరుగుతుంది. డిసెంబర్ నెలలో బిగ్ గేమ్ ఉంటుందని మా నాయకులు చెప్పారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి పోతోంది. ఇది దివాళాకోరు ప్రభుత్వం. వారి వద్ద డబ్బు లేదు. ఇక వారు పనులెలా చేస్తారు. రాష్ట్రాన్ని నడుపుతున్న సగం మంది ఇప్పుడు జైలులోనే ఉన్నారు. మిగిలినవారు కూడా జైలుకు వెళ్తారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారంటూ అగ్నిమిత్ర ప్రశ్నించారు.

బీజేపీతో టచ్‌లో 41 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు

కాగా, పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా వారం రోజుల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. త్వరలో మమతా బె నర్జీ అరెస్టవుతారని, దీంతో 40 మంది టీఎంసీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. 41 మంది టీఎంసీ సీనియర్ నేతలు బీజేపీ అగ్రనేతలతో కాంటాక్టులో ఉన్నారు. డిసెంబర్ నెలలో మమతా సర్కారు కూలడం ఖాయం అని మజుందార్ వ్యాఖ్యానించారు.

టీఎంసీకి డిసెంబర్ తుది గడువంటూ సువేందు అధికారి

టీఎంసీకి డిసెంబర్ తుది గడువంటూ సువేందు అధికారి

అంతకుముందు బీజేపీ నేత, ప్రముఖ సినీనటుడు మిథున్ చక్రబర్తి కూడా 21 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ) తమ విధులు నిర్వహిస్తున్నాయి. టీఎంసీకి ఈ డిసెంబర్ నెల తుది గడువు అని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Big game in West Bengal: TMC Will Not Survive December, MLA Agnimitra Hints At ‘Big Move’ By BJP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X