కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఇకపై..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు, డేటా చోరీలు అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు ఇకపై సోర్స్ కోడ్ ను ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే సాఫ్ట్ వేర్ లో పలు మార్పులు చేయాలని సూచనలు చేసింది. ఈ మేరకు దిగ్గజ మొబైల్ తయారీ కంపెనీలు అయిన ఆపిల్, శామ్ సంగ్ లకు ఈ ప్రతిపాదనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలోనూ మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకమీదట కొత్తగా తయారు చేసే మొబైల్ ఫోన్లలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్ సంచార్ సాతీ యాప్ డీఫాల్ట్ గా ఉండాలని సూచనలు చేసింది.
సైబర్ సెక్యూరిటీలో భాగంగా మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. ఇకపై సెల్ ఫోన్ తయారీ కంపెనీలు తమకు సోర్స్ కోడ్ ను షేర్ చేయాలని ప్రతిపాదించింది. అలాగే సాఫ్ట్ వేర్ లో పలు మార్పులు చేయాలని సూచనలు చేసింది. ఆపిల్, శామ్ సంగ్ లాంటి దిగ్గజ మొబైల్ తయారీ కంపెనీలకు ఈ ప్రతిపాదన చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఇటీవల టెలికాం కంపెనీలను కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపై ఫోన్లలో సంచార్ సాథీ యాప్ డిఫాల్ట్ గా ఉండాలని పేర్కొంది. అలాగే ఇతర యాప్స్ మాదిరిగా ఈ యాప్ ను కస్టమర్స్ డిలీట్ చేయడం కుదరదని స్పష్టం చేసింది.

ఇక భారత్ లో సెల్ ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతుంది. కొన్నేళ్లక్రితం ఇంట్లో ఒకరికి మాత్రమే మొబైల్ ఫోన్ ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లోని చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉంది. ఇక ప్రస్తుతం చైనా తర్వాత ప్రపంచం లోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారత్ కొనసాగుతోంది. 2026 చివరి నాటికి భారత్ లో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటుతుందని అంచనా. అలాగే ఇప్పుడు ప్రపంచ దేశాలకు సెల్ ఫోన్ ఎగుమతి చేసే కీలక దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగింది. గతేడాది ఏకంగా 20.5 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్‌లను ఎగుమతి చేసి ప్రపంచంలోనే మూడో దేశంగా భారత్ నిలిచింది.












Click it and Unblock the Notifications