సత్యేంద్ర జైన్‌కు భారీ ఊరట
Satyendar Jain: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన రెండేళ్ల తర్వాత బెయిల్ వచ్చింది. శుక్రవారం ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి లావాదేవీల విషయంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2002 మే 30న సత్యేందర్ జైన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
2015-16 కాలంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా సత్యేందర్ జైన్ కంపెనీలకు.. షెల్ కంపెనీల నుంచి సుమారు రూ. 4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ హవాలా కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యేందర్ తోపాటు ఆయన కుటుంబానికి చెందిన రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆయను అరెస్ట్ చేసింది.

అయితే, వైద్య కారణాలతో గత ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. అయితే, రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తిరిగి మళ్లీ తీహార్ జైలుకు వెళ్లారు. తాజాగా, సత్యేందర్ జైన్‌కు బెయిల్ లభించడంతో బీజేపీపై విమర్శలు గుప్పించింది అరవింద్ కేజ్రీవాల్ పార్టీ. బెయిల్ రాకుండా చేసిన కుట్రలు విఫలమయ్యాయని పేర్కొంది. సత్యేందర్ జైన్ కు బెయిల్ లభించడం పట్ల సత్యమేవ జయతే అంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది.
'మొహల్లా క్లినిక్‌లను నిర్మించి, ఢిల్లీ ప్రజలకు ఆరోగ్య సేవలను ఉచితంగా అందించడమే అతని ఏకైక తప్పు. మోడీ జీ అతన్ని జైలులో పెట్టాడు, తద్వారా మొహల్లా క్లినిక్‌లను ఆపివేసారు, తద్వారా పేదలకు ఉచిత చికిత్సను అడ్డుకున్నారు. కానీ దేవుడు మనతో ఉన్నాడు. "వెల్కమ్ బ్యాక్ సత్యేంద్ర!" అంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి ముఖ్య నేతలు కొద్దినెలలపాటు జైలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, కోర్టులు బెయిల్ మంజూరు చేయడంతో వారంతా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications