Congress: కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐటీ శాఖ వరుసగా నోటీసులతో టార్గెట్ చేస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. ఇప్పటికే రూ.3500 కోట్లు కట్టాలంటూ వరుసగా 4 ఐటీ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ప్రస్తుతానికి ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకోవద్దని ఐటీ శాఖను ఆదేశించింది.

big relief to congress party over rs 3500 cr IT demand notices

గతంలో అక్రమాలకు పాల్పడ్డారనే కారణంతో ప్రస్తుతం రూ.3567 కోట్లు కట్టాలని ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వేళ నోటీసులు జారీ చేసింది. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జప్తు చేయడంతో పాటు సదరు ఖాతాల్ని నిలిపివేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు పన్ను తీవ్రవాదంగా అభివర్ణించారు. ఎన్నికల వేళ ప్రధాన విపక్షాన్ని బలహీన పర్చడం ద్వారా ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారని తీవ్ర విమర్శలకు దిగారు.

ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న బెంచ్ ముందు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీపై ఐటీ ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. వారికి 2024లో 20 శాతం చెల్లించడానికి అవకాశం ఇచ్చామని, రూ.135 కోట్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు. రూ.1,700 కోట్ల డిమాండ్ నోటీసు తర్వాత ఇచ్చామని, ఇప్పుడు దీనిపైనే అభ్యంతరమని తెలిపారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్రం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పన్ను డిమాండ్ నోటీసుల్ని నిలిపేస్తుందా అని అడిగింది. దీనికి స్పందనగా సొలిసిటర్ జనరల్ ఎన్నికల వరకూ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను జూలై 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యలో ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఎదురైతే అప్పుడు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+