gn saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి-బోంబే హైకోర్టు సంచలన తీర్పు..!

మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో గతంలో అరెస్టై దోషిగా కూడా నిర్ధారణ అయిన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల నేత జీఎన్ సాయిబాబా కేసులో బోంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో గడ్చిరోలి కోర్టు సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాల కేసులో దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయన గత కొన్నేళ్లుగా అనారోగ్యంతోనే జైల్లో గడుపుతున్నారు.

2017లో మావోయిస్టు సాహిత్యం దొరకడంతో ప్రొఫెసర్ సాయిబాబాకు వారితో సంబంధాలున్నాయంటూ ఉపా కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ తర్వాత మహారాష్టలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు విచారణ జరిపి ఆయన్ను దోషిగా నిర్దారించి జైలుకు పంపింది.

big relief to former DU professor saibaba acquitted from moist links case

అయితే 2022లో బోంబే హైకోర్టు అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బోంబే హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. మరోసారి ఈ కేసుపై విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది.

దీంతో మరోసారి విచారణ జరిపిన బోంబే హైకోర్టు.. గతంలో ఇచ్చిన తీర్పునే పునరుద్ధాటించింది. మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా నిర్దారిస్తూ ఇవాళ మరోసారి తీర్పు చెప్పింది. బోంబే హైకోర్టు తీర్పుతో సాయిబాబా నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదే కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా బోంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో వారు కూడా విడుదల కాబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+