బడ్జెట్ నాడే బిగ్ షాక్: భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు!!

నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఇక బడ్జెట్ నాడే దేశ ప్రజలకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలోని చమురు కంపెనీలు ఎల్పిజి సిలిండర్ల ధరలను సవరిస్తాయి . ఈ క్రమంలో తాజాగా సవరించిన ధరల ప్రకారం, దేశంలోని అన్ని నగరాలలో LPG సిలిండర్ ధర భారీగా పెరిగింది.

ఇది బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు కేంద్రం ఇచ్చిన ఝలక్ అని భావిస్తున్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1 నుండి LPG సిలిండర్ ధరను పెంచాయి. 19కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలో ఈ పెంపుదల చేసినట్టు తెలుస్తుంది. అయితే గృహ వినియోగానికి వాడే వంటగ్యాస్ ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి.

Big shock on budget 2024 day: huge increase in lpg gas cylinder prices!!

సబ్సిడీతో కూడిన 14 కిలోల LPG సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర సిలిండర్‌పై రూ.14 పెరిగి రూ.1769.50కి చేరింది. ఇక ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1708.50 గా తాజాగా సవరించిన ధరల ఆధారంగా మారింది. చెన్నైలో రూ. 1937కి కమర్షియల్ సిలిండర్ ధర అందుబాటులో ఉంటుంది.

ఇదిలా ఉంటే నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్లో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తారు అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నికలకు ముందు లోక్ సభలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ కావటంతో సామాన్య మధ్యతరతి ప్రజలు బండ బాదుడు తగ్గిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో మధ్యంతర బడ్జెట్ కు ముందు ఎల్పిజి సిలిండర్ ధరలను పెంచడం సామాన్య ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+