పంజాబ్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్.. జస్బీర్ సింగ్ రాజీనామా.. సోనియాకు భావోద్వేగ లేఖ..
పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలింది. పార్టీ అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్టానం వారిని బుజ్జగించినా వెనక్కితగ్గడంలేదు. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆపార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జస్బీర్ సింగ్ ఖంగుర కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఈమేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
Recommended Video

సోనియాగాంధీకి రాజీనామా లేఖ
తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను లేఖలో సోనియా గాంధీకి జస్బీర్ సింగ్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి జగ్‌పాల్ సింగ్ ఖంగురా 60 ఏళ్లుగా, తాను 20 ఏళ్లుగా నుంచి సేవలు చేశామని గుర్తుచేశారు. పార్టీ తరుపున ఇంత కాలం సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు సోనియాకు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు గతంలోలాగా లేవని విమర్శించారు. సేవ చేసేవారికి గుర్తింపు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

అసెంబ్లీ టికెట్ నిరాకరణ
కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న జస్బీర్ సింగ్ ఎన్నికల వేళ రాజీనామా చేయడం ఆపార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఖిలా రాయ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా మరోకరికి అవకాశం ఇచ్చింది. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్నఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భవిష్యత్తు కార్యాచరణను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు.

కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు
పంజాబ్‌లో అధికారం దగ్గించుకునేందుకు ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒకవైపు, టికెట్ దక్కనివారి అసమ్మతి సెగలతో మరోవైపు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ నేతల మధ్య బేదాభిప్రాయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని రెండు రోజుల కిందటే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హితబోధ చేశారు. మరో సారి అధికారాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

పంజాబ్‌లో కేజ్రివాల్ దూకుడు
అటు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పంజాబ్‌లో మూడు రోజుల నుంచి విసృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ , బీజేపీలపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ ప్రజలు నిజాయితీ గల వ్యక్తిని సీఎంగా ఎంచుకోవాలని కోరారు. ఫిబ్రవరి 20 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications