Big Shot: నిన్న తిండికిలేదు, నేడు పెదపాపకు రూ. 30 కోట్ల ఆస్తి, 18 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు!

భువనేశ్వర్: ఓ యువతి నిరుపేద కుటుంబంలో పుట్టింది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు సక్రమంగా లేవు. యువతికి 20 ఏళ్లు వచ్చిన తరువాత కూడా ఆమె మూడుపూటల తినడానికి సరైన తిండిలేక నానా ఇబ్బందులు పడింది. అయితే ఇప్పుడు ఆ యువతి ఆస్తి రూ. 30 కోట్లకు పైగా ఉంది. విలాసవంతమైన భవనం, ఇటాలియన్ ఇంటీరియర్ డిజైన్, నాలుగు లగ్జరీ కార్లు, మూడు విదేశీ బ్రీడ్ కుక్కలు ఉన్నాయి.

యువతి రోజు లెక్కలేనంత డబ్బులు ఖర్చు చేస్తోంది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తను టార్గెట్ చేసుకున్న యువతి కేవలం నాగులు సంవత్సరాల్లో రూ. 30 కోట్లు సంపాధించిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. యువతి నోరు విప్పితే అధికారంలో ఉన్న ప్రభుత్వం కుప్పకూలుతుందని ప్రతిపక్షాలు బాంబు పేల్చడం కలకలం రేపింది.

నిరుపేద కుటుంబం

నిరుపేద కుటుంబం

ఒడిశాలోని కలహండి జిల్లాలోని లాజిగఢ్ ప్రాంతంలో అర్చనా నాగ్ అలియాస్ అర్చనా (26) అనే యువతి నివాసం ఉంటున్నది. కలహండి జిల్లాలోని మారుమూల ప్రాంతం, పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన కులంలో అర్చనా జన్మించింది. నిరుపేద కుటుంబంలో అర్చనా పుట్టింది.

బ్యూటీపార్లల్ లో ఉద్యోగం

బ్యూటీపార్లల్ లో ఉద్యోగం

అర్చనా కుటుంబ సభ్యులకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు సక్రమంగా లేవు. అర్చనాకు 20 ఏళ్లు వచ్చిన తరువాత కూడా ఆమె మూడుపూటల తినడానికి సరైన తిండిలేక నానా ఇబ్బందులు పడింది. తరువాత అర్చనా ఓ బ్యూటీపార్లల్ లో ఉద్యోగంలో చేరి డబ్బులు సంపాధించడం మొదలుపెట్టింది.

బిత్తరపోయిన ప్రజలు

బిత్తరపోయిన ప్రజలు

రెండు సంవత్సరాలు అర్చనా బ్యూటీపార్లల్ లో ఉద్యోగం చేసింది. తరువాత అర్చనా స్టార్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అర్చనా ఆస్తి రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంటున్నారు. విలాసవంతమైన భవనం నిర్మించుకున్న అర్చనా ఆ భవంతిలో ఇటాలియన్ ఇంటీరియర్ డిజైన్ చేయించింది

కోట్ల రూపాయలు మూలుగుతుంటే ?

కోట్ల రూపాయలు మూలుగుతుంటే ?

నాలుగు లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన అర్చనా ఆమె ఇంటిలో మూడు విదేశీ బ్రీడ్ కుక్కలను పెంచుకుంటున్నది. ప్రతి రోజు లెక్కలేనంత డబ్బులు ఖర్చు చేస్తున్న అర్చనా ఎంజాయ్ చేస్తోంది. నాలుగు సంవత్సరాల్లో అర్చనా ఇంత డబ్బు ఎలా సంపాధించిందో అర్థంకాక ఆమె బంధువులు, స్థానికులు బిత్తరపోయారు.

మేడమ్ మ్యాటర్ బయటపడింది

మేడమ్ మ్యాటర్ బయటపడింది

ప్రముఖ వ్యాపారవేత్త, ఓ రాజకీయ నాయకుడిని ముగ్గులోకి దింపిన అర్చనా ఆ ఇద్దరికి స్వర్గం చూపించింది. తరువాత అర్చనా ఆ ఇద్దరిని బ్లాక్ మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు లాగేసింది. పరువు పోతుందని ఆ ఇద్దరు కొంతకాలం అర్చనా అడిగినంత డబ్బులు ఇచ్చారు. అయితే అర్చనా టార్చర్ తట్టుకోలేక ఇద్దరు కేసులు పెట్టడంతో అర్చనా అసలు బండారం బయటపడింది.

18 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు

18 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు

కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల అర్చనాను అరెస్టు చేశారు. పోలీసుల విచారలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. అర్చనా ట్రాప్ లో 10 మంది మంత్రులు, ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ పార్టీ ఎమ్మెల్యేలు, 25 మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారని వెలుగు చూడటంతో పోలీసులు సైతం బిత్తరపోయారు.

 ప్రభుత్వం కుప్పకూలిపోతుంది

ప్రభుత్వం కుప్పకూలిపోతుంది

పోలీసులు అరెస్టు చేసిన అర్చనా నోరువిప్పితే ఒడిశాలో 22 సంవత్సరాల నుంచి వరుసగా అధికారంలో ఉన్న బీజేడీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తను టార్గెట్ చేసుకున్న యువతి కేవలం నాగులు సంవత్సరాల్లో రూ. 30 కోట్లు సంపాధించిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+