Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Parliament Breach: పార్లమెంట్ లోకి చొరబాటు వెనుక భారీ స్కెచ్-18 నెలల ప్లానింగ్ ?

భారత పార్లమెంటులోకి నిన్న నలుగురు అగంతకుల చొరబాటు వ్యవహారం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన కొత్త పార్లమెంటులోకి అగంతకులు ఇలా సింపుల్ గా ప్రవేశించి పొగ వదలడం, బెంచీలపై ఎక్కి హల్ చల్ చేయడం చూసిన వారంతా అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులోకి చొరబాటు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం అత్యున్నత స్ధాయి దర్యాప్తు చేయిస్తోంది. ఇందులో కీలక విషయాలు బయటపడుతున్నాయి.

పార్లమెంటులో నిన్న జరిగిన చొరబాటు వెనుక 18 నెలల స్కెచ్ ఉందని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా కనీసం 18 నెలల పాటు నిశిత ప్రణాళికతో, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అగంతకులు పక్కాగా సమాచార మార్పిడి చేసుకుంటూ పార్లమెంట్ లోకి చొరబడినట్లు తెలిసింది. "భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్" అనే సోషల్ మీడియా పేజ్ లో ఉన్న వారే ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు చెప్తున్నారు.

big sketch behind parliament breach, 18 months plan, perfect execution..

2001లో పార్లమెంటు దాడికి 22 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 1 గంటకు జీరో అవర్ సమయంలో సాగర్ శర్మ మనోరంజన్ సందర్శకుల గ్యాలరీ నుండి లోక్‌సభలోని ఛాంబర్‌లోకి దూకారు. ఇద్దరూ పసుపు పొగతో కూడిన డబ్బాలను విసిరారు. ఇందులో సాగర్ శర్మ స్పీకర్ కుర్చీ వైపు డెస్క్‌ల మీదుగా దూకాడు. అతన్ని ఎంపీలు పట్టుకుని కొట్టారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల నీలం ఆజాద్, అమోల్ షిండే పసుపు, ఎరుపు రంగు పొగతో కూడిన డబ్బాలను పట్టుకుని నియంతృత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శర్మ లక్నో నివాసి కాగా, మనోరంజన్ మైసూర్, నీలం హర్యానాలోని జింద్, షిండే మహారాష్ట్రకు చెందినవారుగా గుర్తించారు.

ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ప్రకారం చూస్తే.. నిందితులు తొలిసారి 18 నెలల క్రితం మైసూరులో కలిశారు. ఇందులో వారు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్‌లో హింసతో సహా పార్లమెంటు చర్చించాలని వారు భావించే అనేక అంశాలను హైలైట్ చేయడానికి వివిధ మార్గాల గురించి చర్చించుకున్నారు. తొమ్మిది నెలల క్రితం ఈ ఏడాది మార్చిలో మరో సమావేశం నిర్వహించారని, అప్పుడే ఈ భారీ స్కెచ్ తయారు చేసుకున్నారని పోలీసులు చెప్తున్నారు.

చండీగఢ్ విమానాశ్రయం సమీపంలో కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసన నేపథ్యంలో పార్లమెంటు ఘటన నిందితులంతా భేటీ అయ్యారు. నాలుగు నెలల తర్వాత జూలైలో పార్లమెంటు భవనం రెక్కీ నిర్వహించడానికి శర్మ లక్నో నుండి న్యూఢిల్లీకి వచ్చాడు. ఇది సెప్టెంబర్‌లో కొత్త పార్లమెంటు భవనంలో మొదటి సెషన్‌ను నిర్వహించటానికి ముందు జరిగింది. అయితే శర్మ లోపలికి వెళ్లలేకపోయాడు. అతను బయటి నుండి భవనాన్ని పరిశీలించి, అన్ని భద్రతా ఏర్పాట్లను గమనించి, మిగిలిన వారికి చెప్పాడని పోలీసు దర్యాప్తులో తేలింది

ఆ తర్వాత పార్లమెంటులోకి చొరబడాలని, గ్యాస్ క్యాన్ లు విసరాలని నిర్ణయించుకున్నాక శర్మ, మనోరంజన్, నీలం, షిండే డిసెంబర్ 10 ఆదివారం ఢిల్లీకి చేరుకుని గుర్గావ్‌లోని విక్కీ శర్మ ఇంటికి వెళ్లారు. అక్కడ వారు బుధవారం వరకు ఉన్నారు.నిన్న నిందితులు ఇండియా గేట్ వద్ద కలుసుకున్నారని, ఇక్కడే షిండే మిగిలిన నిందితులకు డబ్బాలను పంచారని గుర్తించారు. అతను మహారాష్ట్రలోని తన స్వగ్రామం నుండి ఈ డబ్బాలను సేకరించి తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లాడు.
ముందస్తు ప్లాన్ ప్రకారం మొత్తం ఆరుగురు పార్లమెంటు లోపలికి వెళ్లాలి. కానీ శర్మ, మనోరంజన్‌లకు మాత్రమే పాస్‌లు దొరికాయి. దీంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+