వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్మెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. రిపోర్ట్ లో తేలిందిదే!!

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగ్యూ రోగికి రక్తంలోని ప్లేట్లెట్లకు బదులు బత్తాయి పండ్ల రసాన్ని ఎక్కించారన్న ఆరోపణలతో ఆస్పత్రిని సీజ్ చేసి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ప్లేట్లెట్లకు బదులు బత్తాయి పండ్ల రసాన్ని ఎక్కించడం తో రోగి మృతి చెందిన సంఘటనలో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

డెంగ్యూ రోగికి ఎక్కించింది బత్తాయి రసం కాదు.. కలెక్టర్ వివరణ

డెంగ్యూ రోగికి ఎక్కించింది బత్తాయి రసం కాదు.. కలెక్టర్ వివరణ

కలకలం రేపిన ప్లేట్లెట్ల బదులు బత్తాయి రసం పేషెంట్ కు ఎక్కించిన కేసులో పేషెంట్ కు ఎక్కించింది బత్తాయి రసం కాదని, అది ప్లేట్లెట్ యూనిట్ అని అధికారులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలకు అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ప్రయాగ్ రాజ్ కలెక్టర్ సంజయ్ ఖత్రీ మాట్లాడుతూ పేషెంటుకు ఎక్కించింది బత్తాయి రసం కాదని తెలిపారు. పేషెంట్ కు ఎక్కించింది ప్లేట్లెట్ లేనని పేర్కొన్న జిల్లా కలెక్టర్ కాకుంటే వాటిని సరిగ్గా నిలువ చేయలేదంటూ ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన బృందం తమ నివేదికలో వెల్లడించిందని సంజయ్ ఖత్రీ పేర్కొన్నారు.

రోగికి ప్లేట్ లెట్ లకు బదులు బత్తాయి రసం కేసు

రోగికి ప్లేట్ లెట్ లకు బదులు బత్తాయి రసం కేసు

అక్టోబర్ 17వ తేదిన ప్రదీప్ పాండే అనే వ్యక్తి డెంగ్యూ తో బాధపడుతూ ప్రయాగ్రాజ్ లోని ఈ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అతనికి ప్లేట్లెట్లు ఎక్కించాలి అని వైద్యులు చెప్పడంతో సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్లను తెచ్చారు రోగి బంధువులు. ఇక డాక్టర్లు దానిని పరిశీలించకుండానే ప్లేట్ లెట్లుగా భావించి రోగికి ఎక్కించారు. దీంతో ప్రదీప్ పాండే మృతి చెందారు.

డెంగ్యూ రోగి మృతికి బత్తాయి రసం కారణమని ఆందోళన

డెంగ్యూ రోగి మృతికి బత్తాయి రసం కారణమని ఆందోళన

ఇక డెంగ్యూ రోగి మృతి తర్వాత ఎక్కించిన ప్లేట్లెట్ బ్యాగ్ నకిలీదని చెప్పడంతో ఆ బ్యాగ్ లో బత్తాయి రసం ఉందంటూ రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆసుపత్రిని సీజ్ చేసి, ప్లేట్లెట్ల బ్యాగ్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని అధికారులు కోరినా, ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, పేషెంట్ తరుపు బంధువులు తెచ్చిన ప్లేట్లెట్ల బ్యాగ్ ను తాము ఎక్కించామని వెల్లడించారు.

ఆస్పత్రి ఖాళీ చెయ్యాలని నోటీసులు.. లేదంటే బుల్డోజర్ తో కూల్చేస్తామని ఆదేశం

ఆస్పత్రి ఖాళీ చెయ్యాలని నోటీసులు.. లేదంటే బుల్డోజర్ తో కూల్చేస్తామని ఆదేశం


అయితే వైద్య చికిత్సలో కూడా అవకతవకలు జరిగాయని ఈ ఘటనపై విచారణ చేసిన అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్, వాటిని కూడా కూలంకషంగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తాజాగా ఈనెల 28వ తేదీలోగా హాస్పిటల్ ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన అధికారులు గ్లోబల్ హాస్పిటల్ ను బుల్డోజర్ తో కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు.

డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్‌మెంట్ కేసు: ఫేక్ ప్లేట్‌లెట్లను విక్రయిస్తున్న 10మంది అరెస్ట్!!డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్‌మెంట్ కేసు: ఫేక్ ప్లేట్‌లెట్లను విక్రయిస్తున్న 10మంది అరెస్ట్!!

English summary
Big twist in mosambi treatment to dengue patient case in prayag raj. Collector said that the doctors transfused platelets to the dengue patient who was died. There was no transfuse of mosambi juice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X