సారీ చెప్పు: మోడీ, లాలూపైన పడిన ఫ్యాన్(వీడియో)
పాట్నా: ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సిక్కులకు క్షమాపణలు చెప్పాలని బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ శుక్రవారం డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
బీహార్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో... ఇటీవల ఓ ప్రచార సభలో లాలూ ప్రసాద్ మాట్లాడుతూ.. జైలు కూడా గురుద్వారా లాంటి ప్రదేశమేనని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దీనిని సందర్శించాలని, లేకపోతే జీవితం అర్థవంతంకాదన్నారు. ఈ వ్యాఖ్యలు సిక్కులను అవమానపరిచే విధంగా ఉన్నాయని సుశీల్ మోడీ మండిపడ్డారు.

లాలూ పైన పడిన సీలింగ్ ఫ్యాన్
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పైన సీలింగ్ ఫ్యాన్ పడింది. ఈ సంఘటన శుక్రవారం నాడు జరిగింది. అయితే, ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ సీలింగ్ ఫ్యాన్ కింద పడినప్పటికీ.. నెత్తి పైన పడలేదు.
లాలూ ప్రసాద్ మోతిహారీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తల ఆ సభలో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పైనున్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపోయి కిందపడింది. దానిని యధాస్థానంలో ఉంచాలని లాలూ పార్టీ కార్యకర్తలను ఆదేశించాడు.
అప్పటికే ఒక ఫ్యాన్ పడింది. దీంతో, లాలూ పార్టీ కార్యకర్తలను ఆదేశించాడు. అనౌన్సర్ ఎలక్ట్రిషియన్‌ను పిలిపించాడు. ఆ సమయంలో మరో ఫ్యాన్ లాలూ పైన పడింది. ఈ ఘటనలో లాలూకు చిన్న గాయమైంది. అనంతరం లాలూ జనాలను ఉద్దేశించి ప్రసంగించారు. లాలూ పైన పడిన ఫ్యాన్ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
Ceiling fan falls on Lalu Prasad Yadav during an election rally in Motihari, Bihar pic.twitter.com/kn37SKJsVT
— ANI (@ANI_news) October 16, 2015 











Click it and Unblock the Notifications