Bihar elections: 46 మంది అభ్యర్థులతో బీజేపీ ఫేజ్-2 జాబితాల విడుదల
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రెండో దశ పోలింగ్ జరిగే 46 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాను విడుదల చేయడం గమనార్హం.
ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న నంద కిశోర్, మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా తనయుడు నితీష్ మిశ్రా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలుండగా, 110 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెడుతోంది. 11 సీట్లను వీఐపీకి కేటాయించింది.

ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తుండగా, జితన్ రాం మాంఝీకి చెందిన హెచ్ఏఎంకి ఏడు సీట్లు ఇచ్చింది. . కాగా, 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్ రాష్ట్రంలో మూడు దశల్లో (అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7) ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
నితీష్ చేతిలో బీహార్.. మోడీ చేతిలో దేశం..
ప్రధాని నరేంద్ర మోడీలో చేతిలో దేశం ఎలా సురక్షితంగా ఉందో.. బీహార్ రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే అధికారం నితీష్ కుమార్ చేతిలో ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బీహార్ ప్రజలను నితీష్ కంటికి రెప్పలా చూసుకున్నారని, రాష్ట్రంలో వెలుపల ఉన్నవారికి కూడా ఆర్థిక సాయం చేశారన్నారు.
Recommended Video
గతంలో బీహార్ మొత్తం కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉండేవని, ఆరేళ్లలో అవి 14కు పెరిగాయన్నారు. మరో 11 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత తమదేనని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం పాట్నాకు చేరుకున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే, నితీష్ కుమార్‌ను ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు.
-
సీఎం పదవికి నితీష్ రాజీనామా- మంత్రి మండలి రద్దు: ఫేర్ వెల్ స్పీచ్ లో హైడ్రామా -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications