బీహార్ కేబినెట్లో అనిల్ దేశ్ ముఖ్ లు- మరో వంద కోట్ల కథ- బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్
మహారాష్ట్రలో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ రూ.100 కోట్ల వసూళ్ల వ్యవహారం తేలకముందే ఈసారి బీహార్లో అలాంటిదే మరో వ్యవహారం బయటపడింది.. నితీశ్ కుమార్ కేబినెట్లోని బీజేపీ మంత్రులు అధికారుల బదిలీల కోసం రూ.100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఆరోపించడం సంచలనం రేపుతోంది. దీంతో ఈ వ్యవహారం నితీశ్ మెడకే చుట్టుబోతోతోంది.
బీహార్ లో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి అదే సమయంలో తన శాఖ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ నియంతృత్వ ధోరణిపై జేడీయూకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్నీ సీఎం నితీశ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. గత నెల 23 నుంచి 30వ తేదీ మధ్య తన శాఖకు చెందిన దాదాపు 2 వేల మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు.. అయితే అతుల్ కుమార్ దీన్ని అడ్డుకోవడంతో ఆయన రాజీనామా చేస్తానని సీఎం నీతీశ్ కు తెలిపారు. దీంతో ఈ బదిలీల వ్యవహారం తెరకపైకి వచ్చింది..

మదన్ సాహ్నీ సొంత శాఖలో బదిలీలకు పైరవీలు చేయకుండా తన శాఖ ముఖ్యకార్యదర్శి అడ్డుకోవడంతో ఆయన రాజీనామాకు సిద్దమయ్యారు. కానీ జేడీయూ మాత్రమే కాదు బీజేపీ మంత్రులు కూడా భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ కూడా ఉన్నారు. దీంతో సొంత పార్టీ మంత్రులపై కాషాయ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీహార్ లో బదిలీల కోసం బీజేపీ మంత్రులు వంద కోట్ల వరకూ వసూళ్లు చేశారని ఆయన ఆరోపించారు. అంతే కాదు ఒక్కో అధికారి నుంచి నాలుగు నుంచి 50 లక్షలు తీసుకున్నారని కూడా ఆరోపించారు. దీంతో ఆయన ఆరోపణలు ఇప్పుడు సీఎం నితీశ్ నే తాకుతున్నాయి.












Click it and Unblock the Notifications