బీహార్ కులగణనతో తేలిన బీసీల లెక్క-ఏకంగా ఎంతున్నారో తెలుసా ?
దేశంలోనే తొలిసారిగా బీహార్ లో నిర్వహించిన కులపరమైన జనాభా గణన ఫలితాలు ఇవాళ ప్రభుత్వం బయటపెట్టింది.ఈ సర్వేలో పలు సంచనాలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని అన్ని కులాల జనాభాను లెక్కించినప్పుడు పలు ఆసక్తికర గణాంకాలు కూడా బయటపడ్డాయి. దీంతో లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఈ సర్వే ఫలితాలు సంచలనాలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నో వివాదాల మధ్య కోర్టుల క్లియరెన్స్ తో కుల ఆధారిత సర్వేను మొదలుపెట్టిన బీహార్ ప్రభుత్వం ఎట్టకేలకు తాజాగా దాన్ని పూర్తి చేసింది. ఈ నివేదికను ప్రధాన కార్యదర్శి ఇవాళ విడుదల చేశారు. ఇందులో సీఎం నితీష్ కుమార్ హయాంలో జరిగిన ఈ సర్వే చాలా చర్చనీయాంశంగా మారింది. అలాగే న్యాయపరమైన పరిశీలనకు దారితీసేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇందులో పేర్కొన్న గణాంకాలే.

బీహార్ జాతి అధారిత్ గణన అని కూడా పిలువబడే బీహార్ కుల ఆధారిత సర్వే రాష్ట్రంలో మొత్తం జనాభా 13 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించింది. ఈ జనాభాలో వెనుకబడిన తరగతి 27% మందిని కలిగి ఉండగా, అత్యంత వెనుకబడిన తరగతి 36% మందిని కలిగి ఉన్నారని వెల్లడైంది. ఈ లెక్కన వెనుకబడిన కులాల మొత్తం జనాభా 63 శాతంగా ఉన్నట్లు తేలింది. అలాగే షెడ్యూల్డ్ కులాలు 19 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉండగా.షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతంగా ఉన్నారు. అగ్ర కులాలు లేదా సవర్ణలు జనాభాలో 15.52 శాతం మందిగా తేలారు.
బీహార్ లో కుల ఆధారిత సర్వేకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలతో పాటు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ప్రభుత్వం మాత్రం కుల సర్వేపై గట్టిగా ముందుకెళ్లింది. సామాజిక న్యాయం కోసం సర్వే కీలకమని బీహార్ ప్రభుత్వం పేర్కొంది. దీనికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలైనా సుప్రీంకోర్టు మాత్రం దీన్ని నిలిపేందుకు నిరాకరించింది. దీంతో బీహార్లో యూపీఏ ప్రభుత్వం ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసింది. దీని ఫలితాలతో ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ ఇలాంటి సర్వే కోసం డిమాండ్లు మొదలయ్యే అవకాసముంది.
జనాభాలో భూమిహార్లు 2.86%, బ్రాహ్మణులు 3.66%, కుర్మీలు 2.87%, ముసాహర్లు 3% మరియు యాదవులు 14% ఉన్నారు.
చీఫ్ సెక్రటరీ పరిధిలో పనిచేసే డెవలప్‌మెంట్ కమీషనర్ వివేక్ సింగ్ నేతృత్వంలో ఈ ఫలితాలను ప్రకటించడానికి విలేకరుల సమావేశం జరిగింది.












Click it and Unblock the Notifications