వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బలి -కరోనా సోకి అవయవాలు దెబ్బతిని బీహార్ సీఎస్ అరుణ్ సింగ్ మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి రెండోదశ విలయం అతి భయంకరంగా కొనసాగుతున్నది. తొలి వేవ్ లో సేఫ్ గా బయటపడ్డ రాష్ట్రాలన్నీ సెకండ్ వేవ్ ధాటికి కుదలవుతున్నాయి. తూర్పు రాష్ట్రం బీహార్ లో ఉధృతంగా వ్యాపించిన వైరస్ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా పొట్టనపెట్టుకుంది...

జగన్ బెయిల్ రద్దు: నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు -మే7 డెడ్‌లైన్ -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖజగన్ బెయిల్ రద్దు: నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు -మే7 డెడ్‌లైన్ -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ

బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్‌కుమార్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి, పాట్నాలోని ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొవిడ్ సోకిన తర్వాత అరుణ్ సింగ్ శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయని, పరిస్థితి విషమించడం వల్లే ప్రాణాలు పోయాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Bihar chief secretary Arun Kumar Singh passes away due to COVID-19

1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ కుమార్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో బీహార్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మార్చి తర్వాత నుంచి బీహార్ లోనూ కొత్త కేసులు, మరణాలు పెరుగుతుండటంతో వైరస్ కట్టడి దిశగా ఆయన పని చేశారు. అంతలోనే విషాదకరంగా ఆయనే వైరస్ కాటుకు బలయ్యారు. సీఎస్ మృతిపై సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తదుపరి సీఎస్ ను ఇంకొద్ది గంటల్లో ఖరారు చేయనున్నారు.

Serum పూనావాలాకు వై కేటగిరీ భద్రత -vaccine వేళ మోదీ సర్కార్ కీలక నిర్ణయం -Covishield ధర తగ్గినాSerum పూనావాలాకు వై కేటగిరీ భద్రత -vaccine వేళ మోదీ సర్కార్ కీలక నిర్ణయం -Covishield ధర తగ్గినా

సెకండ్ వేవ్ లో రోజువారీ కేసులు భారీగా పెరగడంతో బీహార్ యాక్టివ్ కేసులు ఇప్పుడు 1లక్షకుపైగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు 4.54లక్షలు, మొత్తం మరణాలు 2,480గా ఉన్నాయి. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సైతం స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

English summary
Bihar chief secretary Arun Kumar Singh on Friday passed away at a hospital in Patna due to COVID-19 complications.Singh, who was a senior IAS officer, was admitted to a hospital after testing positive for coronavirus and was undergoing treatment. He was appointed as the chief secretary of Bihar in February this year, days after Janata Dal-United supremo Nitish Kumar won the assembly elections in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X