'ఓవర్ టేక్ కాల్చివేత'పై నితీష్, ప్రధానిగా అనర్హుడని ఆర్జేడీ ఎంపీ

పాట్నా: గయలో శనివారం రాత్రి జేడీయు ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని కాల్చి చంపిన ఘటనపై సీఎం నితీశ్ కుమార్‌ ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు.

నేరం రుజువైతే ఎలాంటి వారి పైన అయినా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడు రాకీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. న్యాయాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగరక్షకుడ్ని ఇప్పటికే సస్పెండ్‌ చేసి అరెస్టు చేశామన్నారు.

Bihar CM Nitish Kumar is not PM material, says RJD MP Taslimuddin

నితీష్‌కు ఆర్జేడీ ఎంపీ ఝలక్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైన ఆర్జేడీ ఎంపీ ఒకరు చురకలు వేశారు. నితీష్ ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిత్వానికి అనర్హుడన్నారు. సొంత రాష్ట్రంలో సుపరిపాలన అందించలేని మంత్రి దేశానికి సుపరిపాలన ఎలా అందిస్తాడన్నారు.

బీహార్‌లో మద్యపాన నిషేధం విధించిన నితీష్ కుమార్ ఆ విషయాన్ని దేశం మొత్తం ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీహార్‌లో హత్యలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. పాలన కుప్పకూలిందన్నారు. ప్రభుత్వ విభాగాలపై పాలకులు పట్టు కోల్పోయారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+