వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగితే చస్తారుగా.. బీహార్ మద్యం మరణాలపై నితీశ్ కామెంట్స్-పరిహారానికీ నిరాకరణ

|
Google Oneindia TeluguNews

బీహార్ లోని సరాన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 30 మందికి పైగా చనిపోయారు. దీనిపై నితీశ్ కుమార్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో కల్తీ మద్యం తాగి ఇంతమంది చనిపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ కుమార్.. తాజాగా ఈ వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బీహార్ మద్యం మృతుల కుటుంబాకు పరిహారాన్ని సీఎం నితీశ్ కుమార్ నిరాకరించారు. దీంతో పరిహారం కోసం ఎదురుచూస్తున్న మద్యం మృతుల కుటుంబాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన నితీశ్ కుమార్ తన వ్యాఖ్యలతో అగ్గికి ఆజ్యం పోశారు. బీహార్లో 2016 నుంచే మద్య నిషేధం అమలవుతోందని, తాగితే చస్తారని ప్రజలు తెలుసుకోవాలని నితీశ్ సూచించారు. అలాగే ఇకపై మద్యం తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా మరో ఉచిత సలహా ఇచ్చారు.

bihar cm nitish kumar refuse compensation to liquor deathss families, say more vigilent

మద్యం మరణాల తర్వాత ఎదురవుతున్న నిరసనలపై నితీష్ కుమార్ విధానసభలో ఓ దశలో సహనం కోల్పోయారు. బిజెపి సభ్యుల్ని ఉద్దేశించి మీరు తాగి మాట్లాడుతున్నరంటూ విమర్శలు చేశారు. ఇవాళ మద్యం మృతుల కుటుంబాలకు పరిహారం నిరాకరించడంతో పాటు వారిపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాము ఇప్పటికే మద్య సేవనంపై అవగాహన డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు నితీశ్ తెలిపారు. నిషేధం లేనప్పుడు కూడా విషపూరితమైన మద్యంతో ప్రజలు చనిపోతున్నారని నితీస్ గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్ధితి ఉందన్నారు.

English summary
bihar cm nitish kumar on today refused compensation to liquor deaths' families and suggested that they must be vigilent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X