సీఎంకు మోదీ ఫోన్ కాల్..ఆ వెంటనే రాజీనామా
Nitish Kumar: బిహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటికి రావాలని జనతాళ్ (యునైటెడ్) నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది.
జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించారు. కొద్దిసేపటి కిందటే ఆయన పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

అనంతరం రాజ్‌భవన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను క్లుప్తంగా వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు రద్దు చేయాలని కోరినట్లు వివరించారు. రాష్ట్ర పరిపాలన, రాజకీయాలు సవ్యంగా సాగట్లేదని వివరించారు.
రాజీనామా చేయడానికి రాజ్‌భవన్‌కు బయలుదేరిన సమయంలో నితీష్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఫోన్ కాల్ అందినట్లు తెలుస్తోంది. మహా కూటమి నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నందు వల్ల ఆయనను అభినందించారు. ఎన్డీఏ కూటమిలో చేరాలంటూ లాంఛనంగా ఆహ్వానించారు.

కాగా- ఈ సాయంత్రం ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ- దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.
జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతు ఇస్తోన్న సభ్యులతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications