బీహార్ ట్విస్ట్‌లు: నితీష్ కుమార్‌కు హైకోర్టు ఝలక్, మాంఝీకి ఊరట
న్యూఢిల్లీ/పాట్నా: బీహార్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. తాజాగా జేడీయూ శాసన సభా పక్షనేతగా ఎన్నికైన ఆ పార్టీ సీనియర్ నేత నితీష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురయింది. ఆయన ఎన్నిక పైన పాట్నా హైకోర్టు స్టే ఇచ్చింది.
జేడీయూ సమావేశం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. నితీష్ ఎన్నిక పైన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మద్దతుదారులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని పైన న్యాయస్థానం స్పందించింది. శాసన సభా పక్ష నేత నిర్ణయం గవర్నర్ తీసుకుంటారని తెలిపింది.

తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీష్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయనకు జేడీయూతో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, శరద్ పవార్ పార్టీ మద్దతు పలుకుతోంది. దీంతో నితీష్ రెండు రోజుల క్రితం జేడీయూ శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
మంగళవారం రాత్రి తన మద్దతుదారులతో కలిసి నితీష్ ఢిల్లీకి వచ్చారు. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు అపాయింటుమెంట్ తీసుకున్నారు. తనకు మద్దతు ఉందని ఆయన వివరించాలని భావించారు. అంతలోనే హైకోర్టు నుండి స్టే వచ్చింది. మరోవైపు మాఝీ తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జేడీయూలో చీలిక తెచ్చారు.












Click it and Unblock the Notifications