బీహార్, జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు LIVE: MMC అంటే ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్: ప్రధాని మోడీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ లెక్కింపు నవంబర్ 14, గురువారం రోజున జరగనుంది. అంతకుముందు, నవంబర్ 11 (మంగళవారం) రోజున రాష్ట్రంలో 67.13 శాతం ఓటింగ్ నమోదు కావడంతో బీహార్ చరిత్ర సృష్టించింది. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం, 1951 తర్వాత బీహార్‌లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం.ఈ ఎన్నికలలో 62.98 శాతం మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 71.78 శాతం మంది మహిళా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని బీహార్‌లో మరో రికార్డు సృష్టించారు.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమికి సునాయాస విజయాన్ని అంచనా వేశాయి.ఎన్డీయేకు 121 నుంచి 141 సీట్లు వస్తాయని అంచనా వేస్తుండగా... కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి 98 నుంచి 118 సీట్లు వస్తాయని జోస్యం చెప్పాయి.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉంటే ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.
Top Fight - రాఘోపూర్
తేజస్వీ యాదవ్
(ఆర్జేడీ)
Leading
సతీష్ కుమార్
(బీజేపీ)
Trailing
పట్నా బీజేపీ కార్యాలయంలో సంబరాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేయబోతుండటంతో పట్నాలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉత్సవ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ సంతోషాన్ని, ఉత్సాహాన్ని పంచుకుంటూ 'శక్తి ప్రదర్శన' చేస్తున్నారు.
#WATCH | Patna, Bihar: BJP leaders display a show of strength as they celebrate at the party office in Patna
— ANI (@ANI) November 14, 2025
The National Democratic Allaince (NDA) is set to secure a historic win in Bihar#BiharElection2025 pic.twitter.com/apidLRTuQ6
భారీ ఆధిక్యంలో తేజస్వి యాదవ్!
బీహార్ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠను రేపిన రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ తిరుగులేని విజయం దిశగా పయనిస్తున్నారు. మొత్తం 31 రౌండ్లలో 29వ రౌండ్ ముగిసే సమయానికి తేజస్వి యాదవ్ తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై భారీ ఆధిక్యాన్ని సాధించారు. తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) 1,16,467 ఓట్లతో పటిష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. సతీష్ కుమార్ (బీజేపీ) 1,02,587 ఓట్లు సాధించారు. తేజస్వి యాదవ్ ఏకంగా 13,880 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.
బీహార్‌లో ఎన్డీఏ విజయం చారిత్రకం– బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన విజయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం **"చారిత్రకమైనది"**గా అభివర్ణించారు. ఈ తీర్పు ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఎజెండాకు లభించిన స్పష్టమైన ఆమోదంగా ఆయన పేర్కొన్నారు.
बिहार के जनता के बहुत-बहुत प्रणाम। जय सिया राम
— Jagat Prakash Nadda (@JPNadda) November 14, 2025
बिहार में राष्ट्रीय जनतांत्रिक गठबंधन (NDA) को मिला ऐतिहासिक जनसमर्थन आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन एवं मुख्यमंत्री श्री @NitishKumar जी के नेतृत्व में डबल इंजन सरकार की विकासोन्मुखी एवं जनकल्याणकारी…
ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసమే కారణం-మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుత విజయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఈ గెలుపు ప్రధాన మోదీ, నితీష్ కుమార్‌లపై బీహార్ ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని తెలియజేస్తుందని అన్నారు.
#WATCH | Delhi | On NDA heading towards a landslide victory in #BiharElection2025, Maharashtra CM Devendra Fadnavis says, "I want to congratulate Bihar BJP and the NDA alliance. This victory shows the faith that people of Bihar have in PM Modi and Nitish Kumar. It is also a… pic.twitter.com/RGeWaYP4P4
— ANI (@ANI) November 14, 2025
మాకు ముందే తెలుసు: త్రిపుర సీఎం మాణిక్ సాహా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటి ఘన విజయం సాధించిన సందర్భంగా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా హర్షం వ్యక్తం చేశారు. "మేము చాలా సంతోషంగా ఉన్నాం. బీహార్‌లో గెలవబోతున్నామని మాకు ముందే తెలుసు. నేను ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మేము పశ్చిమ బెంగాల్‌లో కూడా గెలుస్తాం." అని ఆయన అన్నారు.
#WATCH | Agartala: On the NDA crossing the majority figure in Bihar, Tripura Chief Minister Manik Saha says, "We are very happy and we knew that we were going to win in Bihar. I want to thank Prime Minister Modi...In the coming days, we will also win in West Bengal..." pic.twitter.com/xK0rWmAhLk
— ANI (@ANI) November 14, 2025
ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాం -ప్రధాని మోదీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విజయం కోసం అలుపెరుగని కృషి చేసిన ప్రతి ఎన్డీఏ కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. "అలుపెరుగకుండా పనిచేసిన ప్రతి ఎన్డీఏ కార్యకర్తకు కృతజ్ఞతలు. వారు ప్రజల్లోకి వెళ్లి మా అభివృద్ధి ఎజెండాను సమర్పించారు. ప్రతిపక్షం వ్యాప్తి చేసిన ప్రతి అబద్ధాన్ని గట్టిగా తిప్పికొట్టారు. వారి కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను." అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీహార్ అభివృద్ధికి పూర్తి అంకితభావంతో పనిచేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. "ముందున్న రోజుల్లో బీహార్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి, దాని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపు ఇవ్వడానికి పూర్తి నిబద్ధతతో కృషి చేస్తాం. బీహార్ యువత, మహిళలు సుసంపన్నమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి తగినన్ని అవకాశాలు పొందేలా మేము చూస్తాము." అని ప్రధాని పేర్కొన్నారు.
सुशासन की जीत हुई है।
— Narendra Modi (@narendramodi) November 14, 2025
विकास की जीत हुई है।
जन-कल्याण की भावना की जीत हुई है।
सामाजिक न्याय की जीत हुई है।
बिहार के मेरे परिवारजनों का बहुत-बहुत आभार, जिन्होंने 2025 के विधानसभा चुनावों में एनडीए को ऐतिहासिक और अभूतपूर्व जीत का आशीर्वाद दिया है। यह प्रचंड जनादेश हमें…
వాళ్లలో అసూయ, అహంకారం పోలేదు-సీఎం రేవంత్
హరీష్ రావు తన అసూయను తగ్గించుకోవాలి. కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలి. అధికారం శాశ్వతం కాదు, వారసత్వం కాదు. అధికారం పోయినా వాళ్లలో అసూయ, అహంకారం పోలేదు. అలాంటి వీళ్లకు అధికారం ఎలా ఇస్తారు?. ప్రజా సమస్యలపై సూచనలు ఇవ్వండి.. నిరసనలు తెలపండి, అంతే కానీ తప్పుడు ప్రచారం చేయొద్దు. -సీఎం రేవంత్ రెడ్డి.
అభివృద్ధికి బాటలు వేస్తున్నాం.-సీఎం రేవంత్
ఈ తీర్పును బాధ్యతగా తీసుకుని హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించి మరింత అభివృద్ధి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనతో అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. చెరువులు, కుంటలు కబ్జాలు కాకుండా చర్యలు చేపట్టాం. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. -సీఎం రేవంత్ రెడ్డి
ఇది ప్రజా తీర్పు -సీఎం రేవంత్
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు సాధిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లుగా ప్రజలు నిశితంగా గమనించి ఈ తీర్పు ఇవ్వడం జరగింది. -సీఎం రేవంత్
బీహార్ తీర్పు అందువల్లే -అమిత్ షా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన భారీ విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం 'వికసిత బీహార్'ను నమ్మే ప్రతి బీహారీకి దక్కిన విజయంగా ఆయన అభివర్ణించారు. ఎన్డీఏ ఘన విజయం అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. బీహార్ ప్రజల తీర్పు కేవలం 'పనితీరు రాజకీయాల'ఆధారంగానే వచ్చిందని స్పష్టం చేశారు. "ఇది ‘వికసిత బీహార్’ను నమ్మే ప్రతి బీహారీకి దక్కిన విజయం. జంగిల్ రాజ్ (అరాచక పాలన), బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు ఏ రూపంలో వచ్చినా, వారికి దోచుకోవడానికి అవకాశం లభించదు. ప్రజలు ఇప్పుడు తమ తీర్పును 'పనితీరు రాజకీయాల' ఆధారంగా మాత్రమే ఇస్తున్నారు." అని అమిత్ షా ట్వీట్ చేశారు.
Union Home Minister Amit Shah tweets, "...I assure the people of Bihar and especially our mothers and sisters that with the hope and trust with which you have given this mandate to the NDA, under the leadership of Modi ji, the NDA government will fulfill it with even greater… pic.twitter.com/ubxBgBLPys
— ANI (@ANI) November 14, 2025
అంతా మహిళల వల్లే- బీజేపీ ఎంపీ రవి కిషన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన తిరుగులేని విజయంపై బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్ స్పందించారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రకమని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వేసిన ఓటుగా అభివర్ణించారు. "ప్రధానమంత్రి మోదీ మరియు నితీష్ కుమార్లపై నమ్మకం ఉంచిన బీహార్ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. మహిళలు, తొలిసారి ఓటు వేసిన ఓటర్లు బంపర్ ఓటింగ్ చేశారు. ఇది అద్భుతమైన ఫలితం." అని రవి కిషన్ అన్నారు.
#WATCH | Mumbai: On NDA heading towards a landslide victory in Bihar, BJP MP Ravi Kishan says, "... I want to thank the people of Bihar for believing in Modi and Nitish Kumar. Nitish Kumar will be the CM once again. People voted in historic numbers. Women and first-time voters… pic.twitter.com/uGHGfxZuLl
— ANI (@ANI) November 14, 2025
తేజస్వి యాదవ్ మళ్లీ ముందంజ!
రాఘోపూర్ నియోజకవర్గంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ 19వ రౌండ్‌లోకి లెక్కింపు ప్రవేశించే సమయానికి బీజేపీ అభ్యర్థిపై మళ్లీ ఆధిక్యాన్ని సాధించారు. తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) 72,932 ఓట్లు సాధించి ముందంజలో ఉన్నారు. సతీష్ కుమార్ (బీజేపీ) 71,746 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. తేజస్వి యాదవ్ ప్రస్తుతం 1,186 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఉన్నారు.
తేజస్వి యాదవ్ వెనుకబాటు!
బీహార్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ తీవ్ర వెనుకబాటును ఎదుర్కొంటున్నారు. మొత్తం 30 రౌండ్లలో 16వ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి గణనీయమైన ఆధిక్యాన్ని సాధించారు. సతీష్ కుమార్ (బీజేపీ) 65,411 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) 55,706 ఓట్లతో, 9,705 ఓట్ల భారీ తేడాతో వెనుకబడి ఉన్నారు.
బీహార్లో తిరుగులేని తీర్పు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హర్షం
బీహార్‌లో ఎన్డీఏ అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పందించారు. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ ఏకంగా 206 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకంటే బీజేపీ మెరుగైన స్థానాన్ని కనబరిచింది. ప్రధాని మోదీ , సీఎం నితీష్ కుమార్ సాధించిన అభివృద్ధికి ప్రజల ఆమోదమే ఈ తీర్పు అని జైస్వాల్ అన్నారు.
కేవలం 2 సీట్లలోనే కాంగ్రెస్ ఆధిక్యం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటుండగా.. కాంగ్రెస్ ప్రదర్శన మహాఘటబంధన్ (MGB) కూటమికి పెద్ద దెబ్బగా మారింది. కాంగ్రెస్ పోటీ చేసిన మొత్తం 61 స్థానాలలో కేవలం రెండు సీట్లలో మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న స్థానాలు కిషన్‌గంజ్, భాగల్పూర్ మాత్రమే. కిషన్‌గంజ్‌లో మాత్రమే మహమ్మద్ కమ్రుల్ హోదా 74,964 ఓట్లతో 22,083 ఓట్ల భారీ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. భాగల్పూర్ నియోజకవర్గంలో అజిత్ శర్మ కేవలం 443 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
ఓటమిని అంగీకరించిన ఆర్జేడీ అభ్యర్థి
ముంగేర్ జిల్లాలోని తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ సాహ్ తన ఓటమిని అంగీకరించారు. "ఇది ప్రజల తీర్పు. అయితే, ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరిగిందో, అప్పుడే పోలింగ్‌లో గందరగోళం జరిగింది" అని ఆయన వ్యాఖ్యానించారు. "ఇకపై మేము మా అధ్యక్షుడితో (తేజస్వి యాదవ్) మాట్లాడి, తదుపరి కార్యాచరణ (లీగల్ యాక్షన్) గురించి నిర్ణయం తీసుకుంటాం" అని ఆయన తెలిపారు. సమ్రాట్ చౌదరి (బీజేపీ) 1,22,251 ఓట్లు సాధించి విజయం సాధించారు. అరుణ్ సాహ్ (ఆర్జేడీ): 76,612 ఓట్లు సాధించారు. ఈ విధంగా బీజేపీ అభ్యర్థి సమ్రాట్ చౌదరి 45,639 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు.
ఇండియా కూటమికి కొత్త వ్యూహం అవసరం: డీకే శివకుమార్
బీహార్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమి భారీ ముందంజలో ఉన్న దృష్ట్యా కాంగ్రెస్, ఇండియా కూటమి తప్పనిసరిగా కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న శివకుమార్.. ఈ ఫలితాన్ని తమ పార్టీకి, మిత్రపక్షాలకు పాఠంగా అభివర్ణించారు.
ఓటమి దిశగా తేజస్వీ యాదవ్
బీహార్‌లోని అత్యంత కీలకం అయిన రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు రౌండ్లు దగ్గరపడే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తం 30 రౌండ్లలో 12వ రౌండ్ ముగిసే సమయానికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ వెనుకబడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ 48,453 ఓట్లు సాధించి ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ 43,883 ఓట్లు సాధించి, 4,570 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు.
జేడీయూ 'బాహుబలి' అనంత్ సింగ్ ఘన విజయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలలో జేడీయూ పార్టీకి చెందిన జైలులో ఉన్న 'బాహుబలి' నాయకుడు అనంత్ సింగ్ మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. అనంత్ సింగ్ తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై ఏకంగా 28,206 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు.అనంత్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, ఆయనకున్న ప్రజాదరణ, స్థానిక బలం మోకామాలో విజయాన్ని సుస్థిరం చేశాయి.
అభివృద్ధే నా ఎజెండా: నవీన్ యాదవ్
అభివృద్ధే నా ఎజెండా. అధిక నిధులు తీసుకువచ్చి జూబ్లీహిల్స్ ను మరింత అభివృద్ధి చేస్తా. నేను కక్షపూరిత రాజకీయాలు చేయను. అందరినీ కలుపుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. నన్ను గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం. - జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
రేవంత్ ప్లాన్ వర్కవుట్ అయింది.. బీఆర్ఎస్ కి వాళ్ళే దిక్కు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖరారు అవ్వడంతో కాంగ్రెస్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి .. ఎన్నికలు తర్వాత తమని రెచ్చకొట్టిన బిఆర్ఎస్ అభ్యర్థి సునీతకి ఈ విజయం సమాధానం అని కాంగ్రెస్ అభిమానులు అభిప్రాయపడ్డారు












Click it and Unblock the Notifications