Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Super: బీహార్ సీఎం తేజస్వీ యాదవ్, ఓరి పిచ్చోడా, ఎవడిగోళవాడిది, లీడర్ ఏం చెప్పారు ? వీళ్లు ఏం చేశారు!

పాట్నా/ బీహార్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యుగం అంతం అయ్యింది, బీహార్ కు కాబోయే సీఎం తేజస్వీ యాదవ్ అంటూ RJD కార్యకర్తలు పోస్టర్లు, ఫెక్సీలు వెయ్యడం కలకలం రేపింది. మనం కచ్చితంగా గెలుస్తామని ఎవ్వరూ స్వీట్లు పంచిపెట్టరాదని, రంగులు చల్లుకుని టపాసులు పేల్చి సంబరాలు చేసుకోరాదని, రౌడీల్లా నడుచుకోరాదని ఒక్కరోజు ముందు ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. అయితే ఎవడిగోళవాడిదే అన్నట్లు బీహార్ కాబోయే ముఖ్యమంత్రి అని కాకుండా ఏకంగా బీహార్ సీఎం అయిపోయారని అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజు ఆర్ జేడీ కార్యకర్తలు తేజస్వీ యాదవ్ ఫోటోలతో భారీగా పోస్టర్లు, ఫెక్సీలు ఏర్పాటు చెయ్యడం బీహార్ లో కలకలం రేపింది.

 యాదవ్ ఏం చెప్పారు ? మనోళ్లు ఏం చేస్తున్నారు ?

యాదవ్ ఏం చెప్పారు ? మనోళ్లు ఏం చేస్తున్నారు ?

బీహార్ లో కచ్చితంగా నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇంటికి వెలుతోందని, ఆ రాష్ట్రంలో జేడీయూ, బీజేపీకి ముఖభంగం తప్పదని దాదాపుగా అన్ని సర్వేలు ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఉమ్మడికూటమి సీఎం అభ్యర్థిగా ఇప్పటికే తేజస్వీ యాదవ్ పేరు ప్రకటించేశారు. మనం అధికారంలోకి వస్తామని ముందుగా ఎవ్వరూ స్వీట్స్ పంచుకుని టపాసులు కాల్చి, రంగులు చల్లుకుని సంబరాలు చేసుకోకూడదని, ఆర్ జేడీ కార్యకర్తలు రౌడీలు అని పేరు తెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని ఒక్క రోజు ముందు తేజస్వీ యాదవ్ ఆర్ జేడీ పార్టీ కార్యకర్తలకు మనవి చేశారు.

 బీహార్ సీఎం తేజస్వీ యాదవ్

బీహార్ సీఎం తేజస్వీ యాదవ్

ఆర్ జేడీ కార్యకర్తలు మాత్రం తేజస్వీ యాదవ్ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎవడిగోళ వాడిదే అంటూ అప్పుడే మనం అధికారంలోకి వస్తాం అంటూ కౌంటింగ్ కేంద్రాల ముందు సంబరాలు చేసుకుంటున్నారు. కొందరు నాయకులు పాట్నాతో పాటు బీహార్ లోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో బీహార్ సీఎం తేజస్వీ యాదవ్ అంటూ అప్పుడే పెద్దపెద్ద ఫెక్సీలు, పోస్టర్లు వేసేశారు.

 కలకలం రేపుతున్న ఫెక్సీలు

కలకలం రేపుతున్న ఫెక్సీలు


బీహార్ కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అని కొన్ని సర్వేలు చెప్పాయి. అయితే ఆర్ జేడీ కార్యకర్తలు కాబోయే సీఎం తేజస్వీ యాదవ్ అని కాకుండా ఏకంగా బీహార్ సీఎం అంటూ ఫెక్సీలు ఏర్పాటు చెయ్యడం బీహార్ లో కలకలం రేపింది. కౌంటింగ్ సందర్బంగా జేడీయూ, బీజేపీ కార్యకర్తలు మౌనంగా ఏం జరుగుతుందో చూద్దాం ? అంటూ వేచిచూస్తున్నారు.

Recommended Video

    Bihar polls: Counting of votes begins for 243 Assembly constituencies
     నితీశ్ కుమార్ యుగం ముగిసిపోయింది ?

    నితీశ్ కుమార్ యుగం ముగిసిపోయింది ?

    బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యుగం అంతం అయ్యింది, వలస కూలీలు, వలస కార్మికుల ఉసురు పోసుకున్న నితీశ్ కుమార్ కచ్చితంగా ఇంటికి వెళ్లిపోతారు అంటూ ఆర్ జేడీ నాయకులు శాపనార్థాలు పెడుతున్నారు. బీహార్ కు కాబోయే సీఎం తేజస్వీ యాదవ్ అంటూ RJD కార్యకర్తలు పోస్టర్లు, ఫెక్సీలు వెయ్యడంతో కలకలం రేపింది. మనం కచ్చితంగా గెలుస్తామని ఎవ్వరూ స్వీట్లు పంచిపెట్టరాదని, టపాసులు పేల్చి సంబరాలు చెయ్యకూడదని తేజస్వీ యాదవ్ చెప్పినా ఆర్ జేడీ కార్యకర్తలు మాత్రం నాలుగు రోజులు ముందుగానే దీపావళి పండగ చేసుంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+