Bihar SIR: బీహార్ ఎస్ఐఆర్ పై తేల్చేసిన ఈసీ..! ఇదే ఫైనల్..!
ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా పలుమార్లు జోక్యం చేసుకుని ఎన్నికల సంఘానికి చీవాట్లు పెట్టింది. అయితే సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈసీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై అక్టోబర్ 7న సుప్రీంకోర్టు తుది విచారణ పెండింగ్ లో ఉంది.
తాజాగా చేపట్టిన బీహార్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణలో 65 లక్షల ఓట్ల మేర గల్లంతయ్యాయి. దీనికి కారణం ఆధార్ ను ఓటరు ధృవీకరణ పత్రంగా గుర్తించకపోవడం, ఆధార్ ఉంటే పౌరసత్వం ఉన్నట్లు కాదని తేల్చేయడం. దీంతో భారీ సంఖ్యలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్ ను కూడా తప్పనిసరిగా ఓటరు ధృవీకరణ పత్రాల్లో చేర్చాలని స్పష్టం చేసింది. దీంతో ఈసీ వెనక్కి తగ్గక తప్పలేదు.

ఈ నేపథ్యంలో గతంలో తీసేసిన ఓటర్లను తిరిగి ఆధార్ ను సమర్పించి ఓట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో వారంతా ఆధార్ ను సమర్పించి ఓట్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీటి ఆధారంగా ఇప్పుడు తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాను ఈసీ వెబ్ సైట్లో అధికారికంగా అందుబాటులో ఉంచారు. వీటిని పరిశీలించిన తర్వాత రాజకీయ పార్టీలు, ఓటర్లు సుప్రీంకోర్టుకు తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది.

ఓటర్లు తమ ఓట్లను చెక్ చేసుకోవడానికి ఈసీ ఓ లింక్ ను కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇందులో ఎంటరై తమ ఓట్లను చెక్ చేసుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. బీహార్ లో జరిగిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ డ్రైవ్ దేశంలోనే అతి పెద్దది. ఇందులో 77 వేల మంది బీఎల్వీలు పాల్గొన్నారు. అలాగే 3 వేల మంది సహాయ అధికారులు, 1.6 లక్షల మంది బీఎల్ఏలు కూడా పాలుపంచుకున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications