పిలిచారని వెళ్తే! తలకు తుపాకీ పెట్టి తాళి కట్టించారు: ఏడ్చేసిన యువకుడు

Subscribe to Oneindia Telugu
  తుపాకీ తో బెదిరించి బలవంతంగా యువకుడి తో తాళి కట్టించారు, వీడియో !

  పాట్నా: సాధారణంగా పెళ్లంటే వధూవరుల ఇష్టపూర్వకంగా, ఇరు కుటుంబాల సమ్మతితో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుగుతుంది. కానీ, ఇక్కడ మాత్రం ఓ యువకుడిని హుటాహుటిన రప్పించి, ఆ తర్వాత కిడ్నాప్ చేశారు.

  అనంతరం ఆ యువకుడికి తమ ఇంటికి తీసుకెళ్లి తుపాకీ గురిపెట్టి వధువుకు తాళి కట్టించడం సంచలనంగా మారింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

  బొకారో నుంచి పెళ్లికి..

  బొకారో నుంచి పెళ్లికి..

  వివరాల్లోకి వెళితే.. వినోద్‌ కుమార్‌ అనే యువకుడు బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో జూనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడు డిసెంబర్‌ 3న పాట్నాలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు హతియా-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో బొకారో నుంచి బయలు దేరాడు.

  పెళ్లి చేసుకో లేదంటే చంపేస్తామంటూ..

  పెళ్లి చేసుకో లేదంటే చంపేస్తామంటూ..

  అయితే, సురేంద్ర యాదవ్‌(ప్రస్తుతం అతడు బలవంతంగా పెళ్లి చేసుకున్న యువతి సోదరుడు) అనే వ్యక్తి అతడికి ఫోన్‌ చేసి మోకామాకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లగానే అతడిని కిడ్నాప్‌ చేసి పండారక్‌ గ్రామానికి తీసుకెళ్లి తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు.

  ఎంత ఏడ్చినా..

  ఎంత ఏడ్చినా..

  కాగా, తనను విడిచిపెట్టాలని వినోద్ ఎంతో బతిమాలుకున్నాడు. అయినా వినకుండా చేయి కూడా చేసుకొని తలకు తుపాకీ పెట్టి పెళ్లి జరిపించారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అతడు ఏడుస్తూనే ఉన్నాడు.

  పెళ్లే కదా.. ఉరేస్తున్నారా? ఏంటీ?

  పెళ్లే కదా.. ఉరేస్తున్నారా? ఏంటీ?

  అక్కడున్న కొంతమంది అతడిని ఓదారుస్తూ.. ‘నీకు పెళ్లే చేస్తున్నారు.. ఉరేయడం లేదు' అంటూ పరాచికాలు ఆడటం గమనార్హం. ఈ బలవంతపు పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌‌చల్‌ చేస్తోంది. కాగా, ఆ యువతిని తమ కోడలుగా అంగీకరించాలంటూ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వినోద్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A 29-year-old engineer was reportedly kidnapped and forced to marry a woman at gunpoint in Bihar.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి