• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీహార్: కొంపముంచిన 11సీట్లు -52 స్థానాల్లో తేడా 5వేల లోపే -అత్యధిక, అత్యల్ప మెజార్టీలివే

|

హోరాహోరి అనే పదానికి సరైన నిర్వచనంగా.. సస్పెన్స్ థ్రిల్లర్ కు ధీటుగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లుగానే అనూహ్య గణాంకాలు నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం బీహార్ ఎన్నికల చరిత్రలోనే అరుదైన సందర్భంగా.. ఈసారి దాదాపు పావుశాతం సీట్లలో ఓట్ల తేడా 5వేల లోపే ఉండింది. అధికార పీఠాన్ని తారుమారు చేసే అవకాశమున్న 11 స్థానాల్లో మార్జిన్లు కేవలం వందల్లోనే ఉండటం గమనార్హం. అంతేకాదు, ఈసారి భారీ మెజార్టీలు పొందిన నేతల సంఖ్య 5లోపే ఉంది. అత్యధిక, అత్యల్ప మెజార్టీలపై ఓ లుక్కేస్తే..

బీహార్‌లో ఊపు -వెస్ట్ బెంగాల్‌పై చూపు -ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

52 స్థానాల్లో 5వేల లోపే..

52 స్థానాల్లో 5వేల లోపే..

మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 125 సీట్లు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ కూటమిలో బీజేపీ 74, జేడీయూ 43, హెచ్ఏఎం(మాంఝీ పార్టీ) 4, వీఐపీ పార్టీ 4 సీట్లను గెలుచుకుంది. గట్టిగా పోరాడినా విజయానికి దూరమైన మహా కూటమి 110 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ కూటమిలో ఆర్జేడీకి 75, కాంగ్రెస్ 19, సీపీఐ(ఎంఎల్-లిబరేషన్) 12, సీపీఐ 2, సీపీఎం 2 సీట్లలో గెలిచింది. 5 సీట్లు సాధించిన ఎంఐఎం బీహార్ లో ఆరో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీఎస్పీకి 1, ఇండిపెండెంట్ 1 సీటును గెలుచుకున్నారు. అయితే, ఈసారి ఏకంగా 52 సీట్లలో అభ్యర్థుల మెజారిటీ 5 వేల లోపే ఉండటం.. ఎన్నికల పోరాటం ఎంత హోరాహోరీగా జరిగిందో తెలియజేస్తున్నది. కాగా..

దుబ్బాక ఫలితంపై ఈసీ డిక్లరేషన్ -రఘునందన్ మెజార్టీ మారింది -0.7% తేడాతో టీఆర్ఎస్ ఓటమి

కొంప ముంచిన 11 సీట్లు

కొంప ముంచిన 11 సీట్లు

తుది ఫలితాల్లో 110 సీట్లు సాధించిన మహాకూటమి... ఇంకొక్క ఐదారు సీట్లను దక్కించుకున్నా ఎంఐఎం, బీఎస్పీ, ఇండిపెండెంట్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది. నెక్ టు నెక్ పరిస్థితి ఉన్న స్థానాల్లో అధికార కూటమికి ఫేవర్ గా ఎన్నికల సంఘం వ్యవహరించిందని ఆర్జేడీ మండిపడింది. 10 చోట్ల తమ అభ్యర్థులు గెలుపొందినా, డిక్లరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా, మళ్లీ రీకౌంట్ నిర్వహించి, ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ చూపించారని ఆర్జేడీ ఆరోపణలను ఈసీ ఖండించింది. విమర్శలను పక్కన పెడితే, 1000లోపు అత్యల్ప మెజారిటీతో బీహార్ గెలుపుపై ప్రభావం చూపించిన 11 సీట్ల వివరాలు ఇవే..

అత్యల్ప మెజార్టీలు ఇవే..

అత్యల్ప మెజార్టీలు ఇవే..

హిల్సా అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి కృష్ణమురారి శరణ్ కేవలం 12 ఓట్ల తేడాతో ఆర్జేడీ క్యాండిడేట్ శక్తిసింగ్ యాదవ్ పై విజయం సాధించారు. బార్భిగా స్థానంలో జేడీయూ 113 ఓట్లతో కాంగ్రెస్ పై గెలిచింది. రామ్ ఘర్ సీటులో 189 ఓట్ల తేడాతో ఆర్జేడీ గెలుపొందింది(బీఎస్పీ అభ్యర్థిపై). మతిహాని స్థానంలో జేడీయూను ఎల్జేపీ 333 ఓట్లతో ఓడించింది. భోరే సీటులో జేడీయూ అభ్యర్థి 462 ఓట్లతో సీపీఐ(ఎంఎల్)పై విజయం. దెహ్రీలో బీజేపీ 464 ఓట్లతో సీపీఐపై గెలిచింది. బచ్వారాలో బీజేపీ 484 ఓట్లతో సీపీఐపై విజయం. ఛకాయ్ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సుమిత్ కుమార్ 581 ఓట్ల తేడాతో ఆర్జేడీపై గెలుపొందారు. కుర్హానిలో ఆర్జేడీ 712 తేడాతో బీజేపీపై గెలిచింది. బక్రీ స్థానంలో సీపీఐ అభ్యర్థి 777 ఓట్లతో బీజేపీపై గెలిచారు. పర్బతా అసెంబ్లీ స్థానంలో జేడీయూ తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీపై 951 ఓట్ల తేడాతో గెలిచింది. ఇక..

  Counting of votes for 58 Assembly by-polls across 11 states
  గెలుపే గగనం.. ఇక మెజార్టీనా?

  గెలుపే గగనం.. ఇక మెజార్టీనా?

  మెజారిటీ ఒక ఓటు తేడాతోనైనాసరే సీటు గెలవడమే ముఖ్యం అన్నట్లుగా సాగిన బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఈసారి భారీ మెజార్టీలు నమోదు కాలేదు. కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే 50వేలపైచిలుకు మెజార్టీని సాధించగలిగారు. బీహార్ ఫలితాల్లో అత్యధిక మెజార్టీ వివరాలు ఇలా ఉన్నాయి.. బలరాంపూర్ సీటులో సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి మహబూబ్ ఆలమ్ 53, 597 ఓట్లతో వీఐపీ పార్టీపై గెలిచారు. అమోర్ అసెంబ్లీ సీటులో ఎంఐఎం అభ్యర్థి ఇఖ్తారుల్ ఇమామ్ 52, 515 ఓట్ల తేడాతో జేడీయూపై గెలుపొందారు. బ్రహ్మ్ పూర్ లో ఆర్జేడీ క్యాండిడేట్ శంభునాథ్ యాదవ్ 51, 141 ఓట్ల తేడాతో ఎల్జేపీపై విజయం సాధించారు. సందేశ్ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థి కిరణ్ దేవి 50, 607 ఓట్లతో జేడీయూపై గెలిచారు.

  English summary
  Nitish Kumar- led NDA was back in power in Bihar on Wednesday with a slender majority. in closely contested battle.. 52 seats margins were below 5000 and 11 of them were below 1000 votes. only 5 candidates got 50, 000 plus majority in bihar.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X