అక్రమకట్టడాల కూల్చివేత: ఉద్రిక్తత, వాహనాలకు నిప్పు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో అక్రమ కట్టడాల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలోని హజిపూర్, వైశాలినగర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

రంగంలోకి దిగిన పోలీసులు వారిని స్వల్ప లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. ఆగ్రహించిన స్థానికులు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ దళాలు స్థానిక ప్రజలపై మరోసారి లాఠీ ఛార్జీ చేశారు.
స్థానికుల దాడిలో అధికారులకు, పోలీసుల లాఠీ ఛార్జీలో స్థానికులకు గాయాలయ్యాయి. ప్రత్యామ్నాయం చూపకుండా తమ నివాసాలను కూల్చితే ఊరుకోబోమని స్థానికులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications