బీహార్ లో హనీప్రీత్!? 30 కిలోమీటర్లు ఛేజ్ చేసిన పోలీసులు.. తీరా చూస్తే..
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ బీహార్ లో కనిపించిందన్న వార్తతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీహార్ గుండా పశ్చిమ బెంగాల్ వెళుతున్న ఓ బీఎండబ్ల్యూ కారును 30 క
పట్నా: ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ కోసం రాష్ట్రాలన్నీ జల్లెడ పడుతున్నారు. నేపాల్ పారిపోయిందన్న వార్తల నేపథ్యంలో సరిహద్దులో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె బీహార్ లో కనిపించిందన్న వార్తతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ వైపు వేగంగా దూసుకెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారులో హనీప్రీత్ సింగ్ ఉందనే సమాచారం అందడంతో వారు ఆ కారును వెంబడించారు.

సుమారు 30 కిలోమీటర్లపాటు సాగిన ఛేజింగ్ అనంతరం కారును అడ్డగించగా.. అందులో ఇద్దరిని అరెస్ట్ చేసి ఫోర్బెస్‌గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే చివరకు ఆమె హనీప్రీత్ కాదని తేలింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ కారులో ఉన్న ఓ అందమైన మహిళను చూసిన ధరానా ప్రాంత స్థానికులు హనీప్రీత్ లాగ ఉందే అనుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారట.
దీంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆపై తప్పు తెలుసుకుని వదిలేశారు. అయితే ఆ ఛేజ్ సాగినంతసేపు స్థానిక మీడియాల్లో హనీప్రీత్ అరెస్ట్ అయిందని కథనాలు ప్రసారం కావటం విశేషం. కాగా, పట్నాకు చెందిన యువతి తన కుటుంబ సభ్యుడితో కలిసి వెళ్తుండగా ఇలా పోలీసులకు చిక్కి ఇబ్బందుల పాలయ్యింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications