నడి రోడ్డులో కాల్చివేత: ఎంఎల్ సీ కుమారుడి అరెస్టు

గయా: తన విలాసంవతమైన కారును ఓవర్ టేక్ చేశాడని ఓ యువకుడిని నడి రోడ్డు మీద అతి దారుణంగా హతమార్చిన జేడీయూ ఎంఎల్ సీ కుమారుడిని బీహార్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. రాకీ యాదవ్ అనే కిరాతకుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

కచ్చితమైన సమాచారం అందడంతో మంగళవారం వేకువ జామున గయా నగరంలో తలదాచుకున్న రాకీ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తాము రాకీ యాదవ్ ను మంగళవారం వేకువ జామున అరెస్టు చేశామని గయా సూపరెండెంట్ ఆఫ్ పోలీసు కమిషనర్ గరియా మాలిక్ స్పష్టం చేశారు.

Bihar police on Monday late night arrested the son of a JD(U) MLC who was on the run after the incident

రాకీ యాదవ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన వివరించారు. ఆదిత్య సచ్ దేవా (25) అనే యువకుడు గయా సమీపంలో రాకీ యాదవ్ కారును ఓవర్ టేక్ చేస్తూ వెళ్లాడు. ఈ విషయం గమనించిన రాకీ యాదవ్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఆదిత్య చచ్ దేవా కారును అడ్డుకున్నాడు. ఆ కారులో ఉన్న వారితో రాకీ యాదవ్ గొడవ పెట్టుకున్నాడు. సహనం కొల్పోయిన రాకీ యాదవ్ అతని దగ్గర ఉన్నతుపాకి తీసుకుని కారు మీద ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ దూసుకు వెళ్లి ఆదిత్య సచ్ దేవ్ శరీరంలో గాయం అయ్యింది. తీవ్రగాయాలైన ఆదిత్య సచ్ దేవ్ మరణించాడు. తప్పించుకు తిరుగుతున్న రాకీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+