Bihar Polls: బీహార్ లో 143 మందితో ఆర్జేడీ లిస్ట్ రిలీజ్- కూటమిలో ట్విస్ట్ ల వేళ..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందే విపక్ష కూటమిలో ట్విస్ట్ లు తప్పడం లేదు. ఇప్పటికే విపక్ష మహా కూటమిలో పార్టీలు సీట్ల పంపకాలపై చర్చలు పూర్తి చేసుకున్నా ఫ్రెండ్లీ పోటీల పేరుతో మిత్రపక్షాలకే షాకులు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకూ అభ్యర్ధుల జాబితా ప్రకటించకుండా వ్యూహాత్మక మౌనం పాటించిన ఆర్జేడీ .. ఇవాళ నామినేషన్ల చివరి రోజు కావడంతో ఎట్టకేలకు దాన్ని విడుదల చేసింది.
ఇవాళ 143 మంది అభ్యర్ధులతో కూడిన ఒకే జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. ఇందులో పార్టీ రథసారధి తేజస్వీ యాదవ్ పార్టీ కంచుకోట రాఘోపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇతర నేతల్లో చంద్రశేఖర్ మాధేపుర నుంచి, వీణా దేవి మోకామా నుంచి, ఉదయ్ నారాయణ్ చౌదరి జాఝా సీటు నుంచి పోటీ చేస్తున్నారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవే సీట్లు దక్కాయి. సీనియర్లతో పాటు పలువురు కొత్త ముఖాలకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.

బీహార్ అసెంబ్లీలో ఉన్న 243 సీట్లలో మహాకూటమిలో కీలకమైన ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేస్తోంది. మిగిలిన 100 సీట్లను కాంగ్రెస్ తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ 60 సీట్లలో పోటీ చేస్తోంది. మిగిలిన 40 సీట్లలో కమ్యూనిస్టులతో పాటు ఇతర చిన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇవాళ్టితో రెండో విడత పోలింగ్ కు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పలు చోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ తమ అభ్యర్దులను తప్పుకోవాలని చెప్పే పరిస్దితి లేకపోవడంతో స్నేహపూర్వక పోటీకి దిగుతున్నాయి. దీన్ని సొమ్ము చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications