బీహార్ సంక్షోభం: నేనే ముఖ్యమంత్రినంటున్న మంఝీ

పాట్నా: బీహార్‌ రాజకీయం ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతోంది. జేడీ(యూ)శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నితీశ్‌కుమార్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తూ సోమవారం గవర్నర్‌నను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. కాగా, అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ సిద్ధమవుతున్నారు. దీంతో మాంఝీకి జేడీ(యూ) అధిష్ఠానానికి మధ్య పోరు దాదాపుగా అంతిమ స్థితికి చేరుకుంది.

నితీశ్‌కు మద్దతుగా శనివారం 20మంది మంత్రులు ఇచ్చిన రాజీనామా లేఖలను గవర్నర్‌ ఆమోదించడంతో నాటకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పుడు గవర్నర్‌ నితీశ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? మాంఝీకి బలనిరూపణ అవకాశమిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. కోల్‌కతాలో ఉన్న గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠీ సోమవారం పాట్నా వస్తున్నారు. ఆయన చేతుల్లోనే ఏదైనా ఉంది.

ఇప్పటికీ బీహార్‌ సీఎం తానేనని మాంఝీ మారో సారి అన్నారు. ‘మాంఝీ పడవ ఎప్పటికీ మునగదు' అని ఆదివారం ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఆయన వ్యాఖ్యానించారు. 19, 20తేదీల్లో తాను బలనిరూప ణ చేసుకుంటానని, విఫలమైతేనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు మద్దతివ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. నితీశ్‌కు సంఖ్యాబలముంటే అంత తొందరెందుకని ప్రశ్నించారు. అధికార లేకుండా నితీశ్‌ ఉండలేరని, అందుకే తనను దించాలని చూస్తున్నారని ఆరోపించారు.

Bihar turmoil: Defiant Manjhi refuses to step down, Nitish to stake claim Monday

దళితుడనైనందుకే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక పేద దళితుడికి అండగా ఉండాలో వద్దో అన్న నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కేబినెట్‌ను విస్తరిస్తానని చెప్పారు. మరోవైపు నితీశ్‌కు మద్దతుగా జేడీయూ, దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలు 130 మంది సంతకాలతో కూడిన లేఖను జేడీ(యూ) బృందం రాజ్‌భవన్‌కు అందజేసింది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐల ప్రతినిధులుకూడా కూడా మద్దతు లేఖలు ఇచ్చారు.

శాసనసభాపక్షనేతగా నితీశ్‌ ఎన్నికను స్పీకర్‌ ఉదయ్‌నారాయణ్‌ చౌదరి గుర్తించారు. తమ పార్టీలో విభేదాలు సృష్టించి లబ్ధిపొం దాలని బీజేపీ కుట్ర చేస్తున్నట్లు జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఆరోపించారు. నితీశ్‌సభాపక్ష నేతగా ఎన్నికయ్యాక నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనే అర్హత మాంఝీకి ఎక్కడిదని ప్రశ్నించారు. కాగా, నితీశ్‌ అధికార దాహంవల్లే ఆ పార్టీలో సంక్షోభం తలెత్తిందని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ విమర్శించారు. ఇక నితీశ్‌కు మద్దతుపై ఆర్జేడీ అధినేత లాలూ నిర్ణయాన్ని పార్టీ ఎమ్మెల్యేలు కొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఎలాగైనా అసెంబ్లీలో బల ప్రదర్శనలో విజయం సాధించాలని మాంఝీ వర్గం వ్యూహాలు రచిస్తోంది. కనీసం 40మంది సభ్యుల మద్దతు కూడగట్టుకుంటే మద్దతివ్వడానికి బీజేపీ సభ్యులు 87మంది సిద్ధంగా ఉన్నట్లు వీరు భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా వీరు పావులు కదుపుతున్నారు. దీని కోసం కొత్తగా 22మంది మంత్రులను, 28మంది పార్లమెంటరీ సెక్రటరీలను నియమించాలని యోచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+