Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్ లో ఆ ఫలితం వెనుక ఈసీ ? పరకాల సంచలనం..! లెక్కలతో సహా..!

బీహార్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అనూహ్యంగా సంచలన విజయం నమోదు చేసుకుంది. మహాకూటమితో పాటు అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఏకపక్షంగా 200కు పైగా సీట్లు గెల్చుకుని రికార్డు సృష్టించింది. దీంతో మహాకూటమికి భారీ షాక్ తప్పలేదు. అయితే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత వీటిపై వ్యాఖ్యానించేందుకు సైతం మహాకూటమి పార్టీలు నిరాకరిస్తున్న వేళ.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ మాత్రం ఎక్స్ లో వీటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు.

పోలింగ్ కంటే ఎక్కువ ఓట్ల కౌంటింగ్

ఎక్స్ లో పరకాల ప్రభాకర్ బీహార్ అద్భుతం డీకోడింగ్ పేరుతో ఏకంగా 12 ట్వీట్లు పెట్టారు. ఇందులో ఆయన బీహార్ లో పోలైన ఓట్ల కంటే 1,77,673 ఓట్లు ఎక్కువగా ఎలా లెక్కించారో ఈసీ దేశానికి చెప్పాలని కోరారు. తుది ఓటర్ల జాబితా సంఖ్యను ప్రకటించిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్యను రెండుసార్లు ఎందుకు మార్చిందని అడిగారు. రాష్ట్రంలో పోలైన స్థూల ఓట్ల సంఖ్యను ఈసీ ఎందుకు ప్రకటించలేదన్నారు. అలాగే 30/09/2025 నాటి ఈసీ ప్రెస్ నోట్ నెం. ECI/PN/313/2025 ప్రకారం బీహార్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మొత్తం ఓటర్లు 7.42 కోట్లు అని, వాస్తవ సంఖ్యకు బదులుగా ఈ ఉజ్జాయింపు ఎందుకని ప్రశ్నించారు.

Bihar Vote Discrepancy Revealed by FM Nirmala s husband parakala Prabhakar s Poll Analysis

ఎస్ఐఆర్ గణాంకాలు

అక్టోబర్ 6, 2025 నాటి ప్రెస్ నోట్ నెం. ECI/PN/316/2025 ప్రకారం, 1,63,619 సర్వీస్ ఓటర్లను జోడించిన తర్వాత ఈసీ ఈ సంఖ్యను సవరించిందని, మొత్తం సంఖ్యను 7,43,55,976కు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత 11.11.2025 నాటి ప్రెస్ నోట్ నెం. ECI/PN/351/2025 ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్యను 7,45,26,858 గా పేర్కొందని పరకాల తెలిపారు. చివరిగా పోలింగ్ 66.91 శాతం అని పేర్కొందన్నారు. తర్వాత 12.11.2025 నాటి ప్రెస్ నోట్ నెం. ECI/PN/352/2025లో ఈసీ పోలింగ్‌ను 67.13 శాతానికి పెంచిందన్నారు.

పోలింగ్, కౌంటింగ్ ఓట్ల వ్యత్యాసం

బీహార్ లో పోలైన ఓట్ల మొత్తం సంఖ్య 7,45,26,858లో 67.13 శాతంగా లెక్కించినప్పుడు 5,00,29,880 అవుతుందని పరకాల తెలిపారు. కానీ మొత్తం 243 నియోజకవర్గాల నుండి లెక్కించబడిన మొత్తం ఓట్ల సంఖ్య 5,02,07,553 అవుతుందన్నారు.అలాగే మొత్తం 243 నియోజకవర్గాల నుండి పోలైన ఓట్లు మరియు లెక్కించబడిన ఓట్ల మధ్య వ్యత్యాసం 1,77,673 ఓట్లుగా ఉందన్నారు. దీనిపై ఈసీ సమాధానం చెప్పాలన్నారు.

ఆ లెక్కలెందుకు చెప్పట్లేదు ?

పోలైన ఓట్ల కంటే 1,77,673 ఎక్కువ ఎందుకు, ఎలా లెక్కించబడిందని పరకాల ప్రభాకర్ ఈసీని ప్రశ్నించారు. తుది ప్రత్యేక ఓటర్ల జాబితా సంఖ్యను ప్రకటించిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్యను రెండుసార్లు ఎందుకు మార్చిందని ఆయన అడిగారు. రాష్ట్రంలో పోలైన ఓట్ల స్థూల సంఖ్యను ఈసీ ఎందుకు ప్రకటించలేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో పోలైన ఓట్ల స్థూల సంఖ్యను వారు ఎందుకు వెల్లడించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరియు నియోజకవర్గాల వారీగా స్థూల ఓటింగ్ గణాంకాలను ప్రకటించడానికి ఈసీకి వచ్చిన ఇబ్బందేమిటన్నారు.

Bihar Vote Discrepancy Revealed by FM Nirmala s husband parakala Prabhakar s Poll Analysis

ఎవరి కోసమన్న పరకాల

ఈసీ చర్యల వెనుక కారణం కేవలం అమాయక గందరగోళమా? లేక అసమర్థతా? లేక నిర్లక్ష్యమా? లేక పార్టీకి ప్రయోజనం చేకూర్చే ధోరణితో కూడిన అపారదర్శకతా అని పరకాల నిలదీశారు. లేదా చట్టం మరియు జవాబుదారీతనం కంటే తాను అతీతంగా ఉన్నానని అహంకారంతో ఉన్నారా? అని అడిగారు. ఈసీ గందరగోళం/అసమర్థత/అజాగ్రత్త/అహంకారం/ధోరణితో కూడిన అపారదర్శకత వల్ల ప్రయోజనం పొందే వ్యక్తి అమాయకుడా, దాని గురించి తెలియక బీహార్‌లో తనకు లభించిన తీర్పు నిజమైనదని , ప్రజల హృదయాలను గెలుచుకున్న ఫలితమని నిజంగా భావిస్తున్నాడా?అని పరకాల అక్షింతలు వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+