అత్తతో రాసలీలలు, భార్య లొల్లి: చివరకు అత్తతో పెళ్లి

పాట్నా: బీహార్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. అల్లుడు అత్తను పెళ్లాడాడు. దీనికి గ్రామ పంచాయతీ కూడా అంగీకారం తెలిపింది. బీహార్‌లోని మధేపుర జిల్లాలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. లలితకు(19), సూరజ్‌‌కు(22) రెండేళ్ల కింద పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ఇంగ్లీష్ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

లలిత తల్లి ఆశాదేవి. ఆశాదేవి కూతురు లలిత భర్త సూరజ్‌ను ప్రేమించింది. వారి ప్రేమ వ్యవహారం కాస్తా శ్రుతిమించి అక్రమ సంబంధానికి దారి తీసింది. కూతురుని చూడాలనే సాకుతో వచ్చిన ఆశాదేవి అల్లుడితో రాసలీలలు సాగించేది.
ఆమె మోజులో పడిన సూరజ్ లలితను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ఈ విషయంలో సూరజ్, లలిత మధ్య తరచూ గొడవలు జరిగేవి.

affair

తన తల్లితో అక్రమ సంబంధం తప్పని భార్య ఎంత వాదించినా సూరజ్ వినలేదు. చివరకు సూరజ్, ఆశాదేవి పెళ్లి చేసుకున్నారు. పంచాయితీ పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారు. లలితకు కుమారుడు కూడా ఉన్నాడు. ఆశాదేవి గంటల తరబడి అల్లుడితో ఫోన్‌లో మాట్లాడేదని, ఆ సంభాషణల క్రమంలో అల్లుడిపై పిచ్చి ప్రేమ పుట్టుకొచ్చిందని అంటున్నారు.

వాళ్లిద్దరు పిచ్చిగా ప్రేమించుకున్నారని, అందువల్ల వారిని విడదీయడం సరి కాదని పంచాయతీ పెద్దలు భావించారు. చేసేదేమీ లేక లలితను ఆమె తండ్రి, ఆశాదేవి మాజీ భర్త పురానిలోని ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య తన అల్లుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూతుర్ని ఆ ఇంట్లో ఉంచడంలో అర్థంలేదని తండ్రి అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+