డ్రాగ్ రేస్ చేసి లవర్ ను చంపేశాడు
బెంగళూరు: ప్రియురాలిని వెనుకు కుర్చోపెట్టుకుని బైక్ లో స్టంట్స్ చెయ్యడానికి ప్రయత్నించడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ప్రయివేట్ కాలేజ్ లో పీయుసీ (ఇంటర్) విద్యాభ్యాసం చేస్తున్న షైనీ కిరణ్ (17) అనే యువతి మరణించింది.
పాతమద్రాసు రోడ్డులోని హలసూరులో షైనీ కిరణ్ నివాసం ఉంటున్నది. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో తన ప్రియుడితో కలిసి బైక్ లో బయలుదేరింది. మార్గం మధ్యలో టిన్ ఫ్యాక్టరీ సమీపంలో ఆ యువకుడు బైక్ లో స్టంట్స్ (డ్రాగ్ రేస్) చేశాడు.
గోపాలన్ మాల్ ఎదురుగా బైక్ అదుపుతప్పింది. వెనుక కుర్చున్న షైనీ కిరణ్ కిందపడిపోయింది. క్షణాల్లోనే వెనుక వస్తున్న వాహనం ఆమె మీద దూసుకు వెళ్లింది. షైనీ కిరణ్ కు తీవ్రగాయాలైనాయి.

రోడ్డు పక్కన పడిపోయిన ఆ యువకుడు పైకి లేచి చేతులు దులుపుకుని అక్కడి నుంచి బైక్ లో పరారైనాడు. తనతో పాటు వచ్చిన ప్రియురాలికి ఏమైయ్యింది, ఏలా ఉంది అని కనీసం పట్టించుకోలేదు.
అక్కడున్న వారు బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు గోపాలన్ మాల్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు.
షైనీ కిరణ్ తో పాటు వచ్చిన యువకుడిని సీసీ కెమెరాల్లో గుర్తించామని పోలీసులు అన్నారు. అతని కోసం గాలిస్తున్నారు. షైనీ కిరణ్ చనిపోయిన తరువాత బెంగళూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిఘా వేశారు.
డ్రాగ్ రేస్ చేస్తున్న 151 మందిని అరెస్టు చేసి 151 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నగరంలో యువకులు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రాగ్ రేస్ చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.












Click it and Unblock the Notifications