వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ట్రంప్‌కు తిట్లు..మోదీకి ప్రశంసలు.. ప్రధానికి ఊహించని లేఖ.. అమెరికాను వెనక్కినెడుతూ..

|
Google Oneindia TeluguNews

'కరోనా వైరస్ సృష్టికర్త' అంటూ ట్రంప్ సలహాదారుల చేత విమర్శలు ఎదుర్కొన్నా, తిరిగి వాళ్లను కూడా తిట్టినా, వైరస్ వ్యాప్తి నియంత్రణలో మానవాళికి తన వంతు సాయాన్ని చేస్తూపోతున్నారు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్. వైరస్‌కు విరుగుడు వ్యాక్సిన్లు కనిపెట్టే పని కోసం భారీగా డబ్బు సాయం చేస్తోన్న ఆయన.. కొవిడ్-19తో పోరాడుతోన్న దేశాలకు సాయం చేసేందుకు మరో 250 మిలియన్ డాలర్లను రెడీ చేస్తున్నారు. కరోనా రూపంలో ఎదురైన ఊహించని విపత్తును సమర్థవంతంగా నిర్వహించడంలో అగ్రదేశాలే దారుణంగా విఫలమైనవేళ.. ఇండియాలో మాత్రం.. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. అద్భుతంగా పోరాడుతున్నారంటూ గేట్స్ మెచ్చుకున్నారు.

మోదీకి లేఖ..

మోదీకి లేఖ..

కరోనా వైరస్ నియంత్రణ కోసం మోదీ సర్కారు అమలుచేస్తోన్న చర్యల్ని ప్రశంసిస్తూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బుధవారం ఒక లేఖ రాశారు. తొందరగా మేల్కొని దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడం మొదలు, టెస్టింగ్స్ సంఖ్యను పెంచుతూ, ఎక్కడికక్కడ రోగుల్ని గుర్తిస్తూ, ఆయా ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటిస్తూ, దానికి సమాంతరంగా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ, ఐసోలేషన్స్, క్వారంటైన్ల ద్వారా ప్రజల్ని కాపాడటం ద్వారా మోదీ సర్కార్ కరోనా వ్యాప్తి కర్వ్ ను సాధారణ స్థాయిలోనే ఉంచగలిగిందని గేట్స్ ప్రశంసించారు.

డిజిటల్ వాడకం సూపర్..

డిజిటల్ వాడకం సూపర్..

మహమ్మారిని నియంత్రించడంలో ఇండియా తన దగ్గరున్న అన్ని వనరుల్ని వాడుకుంటున్నదని, ప్రధానంగా కరోనా వైరస్ ట్రాకింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ లో డిజిటల్ టెక్నాలజీ వినియోగించడం, ఆరోగ్య సేతు లాంటి యాప్స్ తో ప్రజల్ని కనెక్ట్ చేసిన తీరు చాలా బాగుందని మోదీని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. అదే సమయంలో పేదల కడుపునింపే పనిని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, తద్వారా సామాజిక సమతుల్యం సాధించగలిగారని గేట్స్ అన్నారు. కరోనా లాంటి మహమ్మారులను మేనేజ్ చేయడంలో ప్రపంచదేశాలన్నీ పరస్పర సహకారం అందించుకునేలా మరిన్ని వ్యవస్థలు ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.

ఇండియాకు 100 మార్కులు..

ఇండియాకు 100 మార్కులు..

ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు కరోనా మహమ్మారి విషయంలో అనుసరించిన స్ట్రాటజీలపై ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ గవర్నమెంట్' ఇటీవల చేపట్టిన అధ్యయనంలో ఇండియాకు నూటికి నూరు మార్కులు లభించాయి. లాక్ డౌన్ విధింపుపై మోదీ తీసుకున్న సత్వర నిర్ణయం చాలా ఎఫెక్ట్ చూపిందని అధ్యయనకారులు పేర్కొన్నారు. ఈ స్టడీలో అమెరికా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాలను వెనక్కి నెడుతూ ఇండియా టాప్ లో నిలవడం గమనార్హం. ‘‘ముందు చూపుతో వ్యవహరించిన కొందరు మాత్రమే ఏ గ్రేడ్ పొందుతారు''అని ఇండియా ర్యాంకుపై బిల్ గేట్స్ కామెంట్ చేశారు.

Recommended Video

COVID-19 : Cabinet Approves Ordinance To Protect Health Workers
ఇదీ తీవ్రత..

ఇదీ తీవ్రత..


ప్రపంచవ్యాప్తంగా బుధవారం రాత్రి నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 26లక్షలకు చేరువైంది. అందులో 7లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, మరణాల సంఖ్య 2లక్షల దిశగా వెళుతోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో 8.2లక్షల మంది ఇన్ఫెక్షన్ కు గురికాగా, అత్యధికంగా 46వేల మంది కన్నుమూశారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీలో 20వేల పైచిలుకు మరణాలు సంభవించాయి. వైరస్ పుట్టిన చైనాలో కొత్త మరణాలు నమోదు కాలేదు. ఇండియాలో కేసుల సంఖ్య 20, 471గా, మరణాల సంఖ్య 652గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పరంగా ఇండియా 17వ స్థానంలో కొనసాగుతున్నది.

English summary
Microsoft founder and Gates Foundation co-chair Bill Gates wrote to Prime Minister Narendra Modi on Wednesday to commend his "leadership and proactive measures" to flatten the Covid-19 curve in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X