Indigo: ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. రెక్కలను ఢీకొట్టిన పక్షి..
గురువారం 160 మంది ప్రయాణికులతో దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా పక్షి ఢీకొట్టింది. గురువారం ఉదయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాక్సీవే నుంచి రన్‌వేలోకి ప్రవేశిస్తుండగా పక్షి ఢీకొట్టింది. పక్షి విమాన రెక్కలను బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
6E 1467 మంగళూరు-దుబాయ్ ఉదయం 8.25 గంటలకు బయలుదేరాలి. విమానం టాక్సీవే నుంచి రన్‌వేలోకి ప్రవేశించినప్పుడు పక్షి ఢీకొన్నట్లు MIA ప్రతినిధి తెలిపారు. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించాడు. విమానం ఉదయం 8.30 గంటలకు తిరిగి ఆప్రాన్‌కు చేరుకుంది. అనంతరం ప్రయాణీకులందరినీ దించేశారు. విమానాన్ని ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో ఇండిగో విమానంలో దుబాయి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు.

రీషెడ్యూల్ చేసిన దుబాయ్ విమానం ఉదయం 11.05 గంటలకు దుబాయ్ బయలుదేరింది. కొద్ది రోజుల క్రితం అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 బోయింగ్ విమానం ఒహాయెలోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫీనిక్స్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన 25 నిమిషాలకో ఓ పక్షుల గుంపు విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం కుడి వైపున ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చి, ఆ తర్వాత మంటలు చెలరేగాయి.
దీంతో అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని కొలంబస్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ చేశారు. ఆ విమానం ఫీనిక్స్ స్కై హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళుతుండగా, అప్పర్ ఆర్లింగ్టన్ మీద ప్రయాణిస్తుండగా విమానాన్ని ఓ పక్షులు ఢీ కొట్టాయి. కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో టెకాఫ్ అయిన విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఫెడెక్స్ విమానం ఢిల్లీ నుంచి దుబాయికి వెళ్తున్న సమయంలో పక్షి ఢీకొట్టింది.












Click it and Unblock the Notifications