మణిపూర్లో బీజేపీ తొలిసారి: సీఎంగా బీరేన్ ప్రమాణం, అందుకే అమిత్ షా గైర్హాజరు
మణిపూర్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన బీరెన్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు.
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన బీరెన్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ నజ్మాహెప్తుల్లా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్లో బీజేపీ 21 సీట్లు సాధించింది. కాంగ్రెస్ అత్యధికంగా 28 స్థానాలు సాధించినా.. బీజేపీకే చిన్న పార్టీలు మద్దతు పలికాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ నజ్మాహెప్తుల్లా బీజేపీని ఆహ్వానించారు. గత అక్టోబర్లో పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత బీరెన్ సింగ్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

మధ్యలోనే తిరిగివెళ్లిపోయిన అమిత్ షా
మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ ప్రమాణస్వీకారానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హాజరుకాలేకపోయారు. తొలుత మణిపూర్ బయల్దేరిన అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఆయన విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. బుధవారం మధ్యాహ్నం బీరెన్ సింగ్ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications