మోడీ మనసులో ఏముంది?: 12 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై భారత ప్రధాని
న్యూఢిల్లీ: రెండు రోజుల రష్యా పర్యటన అనంతరం కాబూల్‌కు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లడంపై శివసేన మండిపడుతుండగా, కాంగ్రెస్ మాత్రం తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ప్రధాని పాకిస్థాన్ పర్యటనను బీజేపీ మంత్రులు, ఇతర నేతలు మాత్రం సమర్ధిస్తున్నారు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని మోడీ లాహోర్‌కు వెళ్లి పెద్ద సంచలనమే సృష్టించారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజపేయి పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత మళ్లీ అదే వాజపేయి 91వ పుట్టిన రోజున మోడీ పాకిస్థాన్‌లో పర్యటించారు.
ఈరోజు పాకిస్థాన్ ప్రధాని తన 66వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇద్దరు నేతల పుట్టిన రోజులు కలవడం కాకతాళీయమే అయినా, ప్రధాని మోడీ మాత్రం కాకతాళీయంగా పాక్ గడ్డపై కాలు పెట్టారని భావించలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మోడీ పాక్‌కు వెళ్లడంపై ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండవచ్చని అంటున్నారు. ఈరోజు ఉదయం ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్‌లో ప్రసంగానికి ముందు తన ట్విట్టర్ తాను నవాజ్ షరీఫ్‌తో మాట్లాడానని, జన్మదిన శుభాకాంక్షలు తెలిపానని మోడీ ట్వీట్ చేశారు. ఢిల్లీకి తిరిగి వచ్చే మార్గమధ్యలో షరీఫ్‌ను కలుస్తున్నట్లు చెప్పి ఆయనకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించారు.
ఆ తర్వాత ఆప్ఘనిస్థాన్ పార్లమెంటులో ప్రసంగిస్తూ, "కొన్ని దేశాలకు నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు" అని పాక్ పేరు చెప్పకుండానే సునిశిత విమర్శలూ చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పాక్ పర్యటన వల్ల జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ వ్యాఖ్యానించారు.
అది ముందుగా తీసుకున్న నిర్ణయం కాకుండా, అప్పటికప్పుడు అనుకున్నదే అయితే అది చాలా పిచ్చి వ్యవహారమని మండిపడ్డారు. అయితే బీజేపీ నేత నళిన్ కోహ్లీ, మంత్రి సుష్మా స్వరాజ్ మాత్రం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వెనకేసుకు వచ్చారు.
పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఉండటం ఈ ప్రాంత ప్రయోజనాలకు మంచిదని, అప్పుడే మన అభ్యంతరాలు కూడా చెప్పొచ్చని నళిన్ కోహ్లీ అన్నారు. రెండు దేశాలు శాంతిని నెలకొల్పేందుకు మంచి సంబంధాలు కొనసాగిస్తే, అది అందరూ స్వాగతించాలి కోరారు. ఇక సుష్మా స్వరాజ్ అయితే.. మంచి రాజనీతిజ్ఞత అంటే ఇదేనని, పొరుగు దేశాలతో ఇలాంటి సంబంధాలే ఉండాలని అన్నారు.
Looking forward to meeting PM Nawaz Sharif in Lahore today afternoon, where I will drop by on my way back to Delhi.
— Narendra Modi (@narendramodi) December 25, 2015 Modi in Lahore: this will be the first time an Indian PM will set foot in Pakistan in 12 years. Vajpayee visited last in 2004 @timesofindia
— Sachin Parashar (@sachinpTOI) December 25, 2015 











Click it and Unblock the Notifications