సీతను కష్టపెట్టారు: రామ, లక్ష్మణులపై పిటిషన్
పట్నా: ఎంతో మంది ప్రజలకు ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, లక్ష్మణుడిపై ఓ న్యాయవాది కేసు వేశారు. సీతాదేవిని అడవిలో విడిచిపెట్టి కష్టాలు పెట్టాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ జరపనుంది.
ఈ అసాధారణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాకు చెందిన ఠాకూర్ చందన్ సింగ్ అనే న్యాయవాది రాముడు ఎవరో ఓ వ్యక్తి((చాకలి)) అన్న మాటలు పట్టించుకుని సీతను వనవాసానికి పంపించి ఆమెను కష్టపెట్టాడని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అన్నకు ఎదురు చెప్పక ఆయన ఆదేశాలు పాటించి సీతను అవమానించినందుకు లక్ష్మణుడిపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ జరపనుంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే అంశాన్ని కోర్టు నిర్ణయిస్తుంది.












Click it and Unblock the Notifications