యువతి గ్యాంగ్ రేప్:. కోరిక తీర్చుకోవడంపై ఐదుగురు యువకుల మధ్య గొడవ.. ఒకరి దారుణ హత్య

ఆమె ఒంటరి.. 32 ఏళ్లకే భర్త చనిపోయాడు. తన ముగ్గురు పిల్లలను సాకేందుకు ఇబ్బంది పడుతుంది. అలాంటి ఆమెపై కొందరు కీచకుల కన్నుపడింది. ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుందా అని చూశారు. వారి అనుకున్నట్టే ఆమె ఒంటరిగా దొరికింది. ఇంకేమంది ఆ కీచకులు మాటలతో వేధించి, చుట్టుముట్టి ఎత్తుకెళ్లి లైంగికదాడికి తెగబడ్డారు. తమిళనాడులోని కడలూరులో జరిగిన ఘటన కలకలం రేపుతుంది.

వివాహితపై కన్ను

వివాహితపై కన్ను

తమిళనాడులోని కడలూరు జిల్లా నైవెలికి చెందిన శక్తి (పేరు మార్చాం) తన పిల్లలతో కలిసి ఉంటుంది. ఆమె భర్త చనిపోవడంతో చిన్న చితకా పనిచేసుకుంటుంది. ఆమెపై కొందరి కన్ను పడింది. ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుందా అని సమయం కోసం ఎదురుచూశారు.

 తిరిగివస్తుండగా.. అటకాయించి

తిరిగివస్తుండగా.. అటకాయించి

నిందితులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఇటీవల శక్తి తన బంధువుతో కలిసి బయటకెళ్లింది. ఇంటికి కావలసిన వస్తువులు తీసుకొని వాహనంపై తిరిగొస్తోంది. అయితే నిర్జీవ ప్రాంతంలో ఆమె బంధువు వాహనం నిలుపడం ఆమె జీవితం మలుపులు తిరిగేందుకు కారణమైంది. అతను వాహనం ఆపి తమ పని ముగించుకొని వచ్చేలోపు ఐదుగురు మృగాళ్లు చుట్టుమట్టారు. సూటి పోటి మాటలను ఆమె ఇబ్బందిగా భావించారు. ఇంతలో బంధువు వచ్చి వారిని వెళ్లాలని చెప్పడంతో.. మృగాళ్లు రెచ్చిపోయారు.

ఎత్తుకెళ్లి..

ఎత్తుకెళ్లి..

అతనిని నెట్టేసి.. వివాహితను ఎత్తుకెళ్లారు. వారిని వెంబడించిన ఫలితం లేకుండా పోయింది. బంధువు అచేతనంగా ఉండిపోయాడు. కార్తీక్, సతీశ్ కుమార్, రాజదురై, శివబాలన్, ప్రకాశ్ అనే యువకులు వివాహితను నిర్జీవ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అయితే లైంగికదాడికి సంబంధించి వీరి మధ్య గొడవ జరిగింది. ప్రకాశ్ ఒక్కడు ఒకవైపు.. నలుగురు మరోవైపు ఉన్నారు. వారు తమ స్నేహితుడు అని కూడా చూడకుండా ప్రకాశ్‌ను మట్టుబెట్టారు.

 లైంగికదాడి

లైంగికదాడి

ప్రకాశ్‌ను హతమార్చిన సమీపంలోనే వివాహితపై లైంగికదాడికి తెగబడ్డారు. ఒకరి తర్వాత ఒకరు నలుగురు తమ కామవాంఛ తీర్చుకున్నారు. లైంగికదాడి చేసే సమయంలో అడ్డుకోవడంతో వివాహితపై దాడి కూడా చేశారు. దీంతో ఆమె సృహ కోల్పోయింది. తర్వాత నలుగురు మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు. కాసేపటికి మెలకువ వచ్చి.. జరిగిన అనర్థం గురించి తెలుసుకొని వివాహిత బాధపడింది. తన పక్కనే ప్రకాశ్ శవం చూసి భయపడింది. సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన దారుణం గురించి వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దినసరి కూలీలు

దినసరి కూలీలు

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను గుర్తించారు. వారంతా రోజువారీ కూలీలని పోలీసులు తెలిపారు. వారిని జ్యుడిషీయల్ కస్టడీకి తరలించామని పేర్కొన్నారు. వివాహితకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+